20 రోజులుగా ఆ ఊరి ప్రజలకు నిద్రలేదు ? కారణం దెయ్యం ..?

సైన్సు అభివృద్ధి చెందుతున్న రోజులు ,దెయ్యాలు భూతాలు ఈ పేర్లు ఎప్పుడో రాజుల కాలం లో ఉండేవి అని కధలలో చదివాము కానీ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కాండ్రకోటలో మల్లి ఆ మాటలు వినిపిస్తున్నాయి అసలు కదా ఏమిటంటే ..? కాండ్రకోట.. 20 రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న గ్రామం అంది. అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కాండ్రకోట ప్రజలు 20 రోజులుగా ఓ వింత ఆకారంతో భయం భయంగా జీవనం సాగిస్తున్నారు. వారికి కంటిమీద కునుకే కరువైంది. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి, ఒక చెట్టు పై నుంచి మరో చెట్టుపైకి పరుగులు తీస్తూ.. కేకలు పెడుతూ ఆ వింత ఆకారం కనిపిస్తోంది.ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సమీపంలో ఉన్న పెద్దాపురం మండలంలో కాండ్రకోట గ్రామం ఉంది. ఈ ఊరి ఇలవేల్పు నూకాలమ్మ తల్లి. 20 రోజులుగా గ్రామంలో ఒక దుష్టశక్తి గ్రామస్తులను భయపెడుతోంది. సైన్స్‌ ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇలాంటివి ఉంటాయా అంటే ఒకరో ఇద్దరో చెబుతున్న విషయం కాదు ఊరు ఊరంతా ఈ విషయాన్ని నమ్ముతోంది. అది తెలుసుకుంటే మనం కూడా ఏదో శక్తి ఉందని నమ్మాల్సిందే.20 రోజుల క్రితం ఓ వ్యక్తి ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా నల్లని పొడుగాటి తలతో గ్రామంలో పరుగులు తీశాడట. ఆపై ముగ్గువేసి నిమ్మకాయలతో పూజలు చేశాడట. తర్వాత రెండు రోజులు అతడు కనిపించకుండా పోయాడు. రెండు రోజుల తర్వాత నిత్యం రాత్రివేళల్లో గ్రామంలో కనిపిస్తున్నాడు. ఇళ్లపై దూకడం, చెట్లపై దూకడం, వీధుల్లో అరవడం, ఏడవడం, వంటివి జరుగుతున్నాయి. దీంతో గ్రామస్తులు కర్రలు, లైట్లు పట్టుకుని రాత్రంతా కాపలా కాస్తున్నారు. అయినా ఏదో ఒక చెట్టుపై నుంచి ఇంటిపైకి దూకడం చూస్తున్నారు. తాజాగా ఒక మామిడి చెట్టుపై నుంచి కిందకు దూకి ఓ ఇంటి తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేసిందని స్థానికులు చెబుతున్నారు.గ్రామస్తులను భయపెడుతున్న ఆ వ్యక్తి ఎవరు అన్నది అంతు చిక్కడం లేదు. దెయ్యమని కొంతమంది అంటుంటే దుష్టశక్తి అని మరికొందరు అంటున్నారు. ఈ రెండూ కాదు.. ఎవటో సగటు వ్యక్తి ఇదంతా చేస్తున్నాడు అని గ్రామంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పట్టుకోవడం మాత్రం వారివళ్ల కావడం లేదు. దీంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చీకటి పడితే భయంతో వణికిపోతున్నారు.గ్రామాన్ని ఏదో దుష్టశక్తి ఇబ్బంది పెడుతుందని భావించిన గ్రామస్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం జరిపించారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.