ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు
ఆధార్వివరాలను ఉచితంగా అప్డేట్చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మరోసారి పొడిగించింది. నిజానికి నేటితో (జూన్ 14) ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు ముగియగా, మరోసారి ఆధార్‌కార్డ్ ఉచిత అప్‌డేట్ కోసం గడువును పొడిగించింది. ఇంకా చాలా మంది ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోలేకపోవడం వల్ల భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆధార్ ఉచిత అప్డేట్కు మరో 3 నెలల వరకు గడువు పొడిగించింది. అందువల్ల యూఐడీ హోల్డర్లు ఎలాంటి ఫీజు చెల్లించకుండానే తమ ఆధార్ కార్డ్‌ను సెప్టెంబర్ 14 వరకు అప్‌డేట్ చేసుకోవచ్చు.భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మొదట మార్చి15 2023 వరకు ఆధార్ ఉచితంగా అప్డేట్చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అనంతరం ఈ గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. ఆ తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అనంతరం జూన్ 14 వరకూ అవకాశం కల్పించింది. ఇప్పడు తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగిస్తూ ఉడాయ్ నిర్ణయం తీసుకుంది. ఆధార్ అప్‌డేట్ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడం వల్లనే ఈ గడువును పొడిగించినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. సెప్టెంబర్ 14 వరకు యూఐడీఏఐ వెబ్‌సైట్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పేరు, అడ్రస్, ఫోటో ఇతర వివరాల వంటి మార్పులను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఉడాయ్ అవకాశం కల్పించింది.
Comments
0 comment