ఐఏఎస్ శ్రీ లక్ష్మిని బాబు గారు ఎందుకు పక్కన పెడుతున్నారు ?

ఆంధ్రలో జరిగిన అవినీతి ఎక్కడా జరగలేదు అని ఇప్పటి నాయకులు అంటున్న మాట ,జగన్ హయాంలో అలా నిలువెల్లా అవినీతి, అక్రమాల మరకలు అంటించుకున్న సీనియర్ అధికారుల్లో ఐఎఎస్ శ్రీలక్ష్మి ఒకరు. ఆమె కనుక నిబంధనల మేరకు పని చేసి ఉంటే చాలా ఉన్నత స్థానానికి ఎదిగి ఉండే వారు. అయితే ఆమె అవినీతి పంచన చేరి అడ్డగోలుగా ఏలిన వారి అక్రమాలకు అండదండలు అందించడానికే మొగ్గు చూపారు.  శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సరే అది పక్కన పెడితే.. ఆ తరువాత కూడా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ అంటే 2019 ఎన్నికల తరువాత నుంచీ తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి వచ్చేందుకు చేయని ప్రయత్నం లేదు. అప్పటికి వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలుగుతున్న జగన్ అక్రమ కేసుల్లో ఏ2 అయిన విజయసాయి రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు చేసి మరీ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.  సరే ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె తెలంగాణ నుంచి ఏపీకి మారారు. ఇక ఆమె ఏపీకి వచ్చిన తరువాత జగన్ అడ్డదిడ్డ, అవకతవక నిర్ణయాలన్నిటికీ వత్తాసుగా నిలిచారు. మునిసిపల్ శాఖ ప్రిన్నిపల్ సెక్రటరీ హోదాలో   నిబంధనలను తుంగలో తొక్కి జగన్ ఏం చేయమంటే అది చేశారు.ఇప్పుడు జగన్ అధికారం పోయింది. మరి శ్రీలక్ష్మి ఏం చేస్తున్నారు. ప్లేటు ఫియాయించి ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు, మునిసిపల్ మంత్రి నారాయణ ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. అయితే శ్రీలక్ష్మి పప్పులు వారి వద్ద ఉడుకుతున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును అందరు ఐఏఎస్ అధికారులతో పాటు అభినందించేందుకు వెళ్లిన శ్రీలక్ష్మి ఇచ్చిన బొకేను చేతితో  తాకడానికి కూడా చంద్రబాబు ఇష్టపడలేదు. దీంతో ఆమె జీవం లేని నవ్వుతో తాను తీసుకువచ్చిన బొకేతోనే వెనుదిరగాల్సివచ్చింది. అక్కడితో ఆమె ఆగలేదు. మునిసిపల్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ వద్దకు మునిసిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో వెళ్లారు. అయితే ఆమె తీసుకువచ్చిన ఫైలును పరిశీలించడానికి కూడా మంత్రి నారాయణ ఇష్టపడలేదు. ఇప్పటికే శ్రీలక్ష్మికి దస్త్రాలేవీ పంపవద్దని స్పష్టమైన ఆదేశాలు సీఎస్ నుంచి జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాలలో ఓ టాక్ నడుస్తోంది. మరి రానున్న రోజులలో శ్రీలక్ష్మికి స్థాన చలనం తప్పదనీ, జగన్ హయాంలో జరిగిన అవకతవకలకు సహకరించినందుకు విచారణను ఎదుర్కోవలసి వచ్చినా ఆశ్చర్యం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.