ఐనవిల్లి విగ్నేశ్వర స్వామి సన్నిధిలో అక్షరాబ్యాసం ,తులాభారం ,అన్నప్రాసన చేస్తే ఆయురారోగ్యాలతో, విద్యావంతులవుతారు

అయినవిల్లి......  సాక్షాత్తు ఆ పార్వతి తనయుడు ,లంబోదరుడు అయినా విగ్నేశ్వరుడు స్వయంభు గా వెలసిన దివ్య క్షేత్రం ,ఇక్కడ స్వామి వారు ,మరెక్కడా కనిపించని విధంగా దక్షిణాభిముఖంగా భక్తులకు  దర్శనం ఇస్తారు,దానికి ఇక్కడ ఒక ఇతిహాసం ప్రచారం లో వుంది అదేమిటంటే  పూర్వకాలంలో మహాఋషులు చేసిన స్వర్ణ గణపతి మహా యజ్ఞము లో ఋషుల యొక్క అభీష్టం మేరకు యజ్ఞం చివరిలో స్వర్ణమయ కాంతులతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారని ఆహుతిని  స్వయంగా స్వీకరించి ఇక్కడ దక్షిణాభిముఖం గా కొలువు తీరారని ప్రతీతి అందుకే స్వామివారు భక్తులకు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు 

1506-entry-1-1717832164.jpg

భక్తులు ఇక్కడ స్వామివారిని తమ ఇలవేల్పుగా చేసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు ,ఎందుకంటే అంతటి భక్తసులభుడు అయినవిల్లి విగ్నేశ్వరుడు,తమ సంతానం అభివృద్ధి చెందాలని ,ఉన్నతశిఖరాలను అధిరోహించాలని ,వారి జీతం లో అద్భుతాలు సాధించాలని  భక్తులు వారి వారి సంతానాలకు ఇక్కడ తులాభారం ,అన్నప్రాసనలు జరుపుతారు ముఖ్యంగా ఇక్కడ జరిగే అక్షరాబ్యాసాలు సాక్షాత్తు విగ్నేశ్వరస్వామియే  వచ్చి జరిపిస్తున్నాడా అన్నట్టు కన్నుల పండుగగా జరుగుతాయి ,అందులోను విగ్నేశ్వర స్వామి సన్నిధిలో జరిగే అక్షరాబ్యాసాలు చేయించుకునే భక్తులు వీటికి అవసరమయ్యే పలకలు,పలకపుల్లలు  పూజాసామాగ్రి,మొదలైనవి తీసుకుని వచ్చి  అయినవిల్లి విగ్నేశ్వరుడిపై ఎంతో భక్తి శ్రద్దలతో అక్షరాబ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు,ఇలా చెయ్యడం వలన తమ సంతానం వారి వారి జీవితాలలో స్వామివారి కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది అని వారి విశ్వాసం 

 

స్వామిపైన భక్తి , విశ్వాసం తో ఏ పని చేసిన మన వెంటే వుంటూ మనకి నిర్విగ్నాలని కలిగిస్తూ ,సకలసౌభాగ్యాలను ప్రసాదించే స్వామి ,అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి