అసెంబ్లీలో జగన్ స్థానం ఎక్కడ ?
ఏపీలో కొత్తగా ఎన్నికలైన సభ్యులతో అసెంబ్లీ సమావేశం కానుంది. గత శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలతో తాను సీఎంగానే ఈ సభలో అడుగుపెడతానంటూ చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు సీఎం హోదాలో శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. దీంతో జగన్ శాసనసభ సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి సహకరిస్తారా లేదా.. తొలిరోజు నుంచే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వంపై విమర్శలను కొనసాగిస్తారా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో వైసీపీకి శాసనసభలో పెద్దగా ప్రాధాన్యత ఉండదుఅదే సమయంలో ప్రతిపక్ష హోదా దక్కకపోవటంతో జగన్ కు ప్రతిపక్ష నేతగా అవకాశం కష్టంగానే కనిపిస్తోంది. సభలో ట్రెజరీ బెంచ్ లకు ఎదురుగా ప్రతిపక్ష నేత..ఆయన పార్టీ సభ్యులకు సీట్లు కేటాయించటం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు ప్రతిపక్ష హోదా దక్కకపోవటంతో జగన్ సీటు సాధారణ ఎమ్మెల్యే తరహాలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జగన్ సైతం సభలో తమకు మాట్లాడే అవకాశం ఉండదని ఇప్పటికే చెప్పుకొచ్చారు. కానీ,ప్రతిపక్షం అవసరం కావటంతో జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చంద్రబాబు- పవన్ కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
Comments
0 comment