అయోధ్యలో కొలువు తీరిన అందాల బాల రాముడు

 భరత ఖండం లో ఈ రోజు అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. బాల రాముడు.. అయోధ్యలో కొలువుదీరాడు. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటూ… 14 జంటలు, 4వేల మంది సాధువులు పాల్గొన్నారు. అలాగే దేశవ్యాప్తంగా వేల మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు.ఈ మహా కార్యక్రమం కోసం దేశం, విదేశాల నుంచి సెలబ్రిటీలు అయోధ్యకు వచ్చారు. లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా లైవ్ ప్రసారం అవుతోంది. అన్ని రైల్వే స్టేషన్లలో లైవ్ ఇస్తున్నారు. న్యూస్18 తెలుగులోనూ లైవ్ అప్‌డేట్స్ ఇస్తున్నాం. 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తున్న, నాగార శైలిలో నిర్మించిన అయోధ్య రామాలయ విశేషాల్ని లైవ్ అప్‌డేట్స్‌లో తెలుసుకోవచ్చు. మూడు అంతస్థుల ఈ ఆలయంలో ప్రస్తుతం గ్రౌండ్‌ఫ్లోర్ పూర్తైంది. మరో సంవత్సరంలో మొదటి అంతస్థు కూడా పూర్తవుతుంది. ఇవాళ గ్రౌండ్ ఫ్లోర్‌లో బాల రాముడి ప్రతిష్టాపన జరుగుతుంది. మొదటి అంతస్థు పూర్తయ్యాక, అందులో పెద్ద రాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు.

భారీ భద్రతా ఏర్పాట్లు:

ఈ మహా కార్యక్రమం కోసం 13వేల మంది పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. అలాగే 10వేల సీసీ కెమెరాలు, యాంటీ మైన్ డ్రోన్లూ ఉన్నాయి. వీటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు, NDRF, వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి.