బీజేపీ లోకి రోజా ?
పూర్వం పెద్దలు ఒక సామెత చెప్పేవారు ,నోరా వాగకే అని వీపు వెళ్లి బ్రతిమలాడేదట అలాగే మన వైసీపీ నాయకుల పరిస్థితి తయారైంది తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆర్కే రోజా ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. ఆమె చెన్నై వెళ్లారా? బెంగళూరు వెళ్లారా అనే విషయంపైనా స్పష్టత లేదు. పోలింగ్ రోజే రోజా తన ఓటమిని అంగీకరించేసి, వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే ఓటమి తథ్యమని అర్థం చేసుకుని రోజా అక్కడి నుండి వెళ్లిపోయారు. మీడియాతో కూడా మాట్లాడలేదు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకూ రోజా అజ్ఞాత వాసం చేస్తున్నారు. వైసీపీని వీడి సేఫ్ పార్టీలోకి చేరలన్న ఉద్దేశంతో ఉన్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు. రోజాకు తెలుగుదేశం, జనసేన తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. అందుకే ఆమె కమలం గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే మూడో సారి ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మోడీకి, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు అభినందనలు తెలుపుతూ రోజా ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్ల ద్వారా బీజేపీ వర్గాలతో టచ్ లోకి వెళ్లి ఆ పార్టీ గూటికి చేరాలని ఆమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితేఅవేమంత ఫలించే అవకాశాలు పెద్దగా లేవనీ అంటున్నారు. మొత్తం మీద రోజా వైసీపీకి సాధ్యమైనంత దూరం జరిగితేనే తనకు సేఫ్ అని భావిస్తున్నారన్నది మాత్రం వాస్తవం.
Comments
0 comment