బొత్సాను పక్కని పెట్టాలని చూస్తున్న సాయన్న ?
వైసీపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారా? అయిష్టంగానే నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారా? ఆయన మనసు విశాఖపై ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలో చేరడంతో.. జగన్ కు విజయసాయిరెడ్డి అవసరం ఏర్పడింది. టిడిపి నుంచి పోటీ చేస్తున్న వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీకొట్టాలంటే విజయసాయిరెడ్డి కరెక్ట్ అని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో జగన్ మాటకు కట్టుబడి విజయసాయి నెల్లూరు నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే అక్కడ గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. అయితే తన మనస్సు ఎప్పుడు విశాఖ వైపు ఉంటుందని విజయసాయి సంకేతాలు ఇచ్చారు. వాల్తేరు క్లబ్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో వైసిపి ఇరకాటంలో పడింది. అక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మికి ఇబ్బందికరంగా మారింది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులయ్యారు. విశాఖ కేంద్రంగా రాజకీయాలను నడిపారు. వైసిపి విజయాల్లో కీలక భూమిక పోషించారు. అయితే ఈ తరుణంలో ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు వంటి వారు విజయసాయిరెడ్డి పెత్తనాన్ని సహించలేకపోయారు. అదే సమయంలో వై వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయసాయిరెడ్డి హవాను తగ్గించాలని చూశారు. అందుకే ఆయన ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యత నుంచి తప్పించేలా జగన్ పై ఒత్తిడి పెంచారు. దీంతో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే తరువాత వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా నియమితులయ్యారు. కానీ విజయసాయిరెడ్డి మనుషులను పార్టీ నుంచి బయటకు పంపించేశారన్న ప్రచారం జరిగింది.
Comments
0 comment