చేబ్రోలు లో భూ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయిన సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు

ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యక్ట్ చట్టం రద్దు తో... ఆంధ్ర ప్రజల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి, ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం,చేబ్రోలులో  గొల్లప్రోలు రురల్ జనసేన మండల కార్యాలయం లో, చల్లా చినబాబు  ఆద్వర్యం లో ఓదూరీ నాగేశ్వరవు ముఖ్య అతిధులుగా సమావేశం జరిగింది,ఇందులో భాగంగా కేక్ కట్  చేసి,జనసైనికులు ,గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు,ఈ కార్యక్రమంలో భాగంగా ఓదూరీ నాగేశ్వరవు గారు మాట్లాడుతూ ,పవన్ కళ్యాణ్ గారి ఆద్వర్యం లో పిఠాపురం నియోజక వర్గం అభివృద్ధి పదం లో నడుస్తుందని...సంక్షేమం అంటే ఎంటో పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చూపిస్తారని వ్యాఖ్యానించారు, ఇక చల్లా చినబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటప్రకారం రైతులకు న్యాయం చేశారని, మెగా డీ.ఎస్.సి తో నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు, ఇక  మాజీ ఎంపీపీ వులవకాయల సత్యనారాయణ మాట్లాడుతూ   ఈ భూ చట్టం తో ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, ఈ ఇబ్బందులు వైసీపీ ప్రభుత్వానికి పట్టలేదని అందుకే గద్ధి దింపారని  వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పెద్దింటి శివ, బుద్ధాల చంటిబాబు, నక్కా గంగరాజు టీడీపీ ,బీజేపీ నాయకులు రైతులు మరియు పెద్ద ఎత్తున జనసైనికులు , ప్రజలు పాల్గొన్నారు

 

 సీనియర్ జర్నలిస్ట్ :-మురళి 

 

చేబ్రోలులో భూ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయిన సందర్భంగా అంబరాన్ని అంటిన సంబరాలు #kknewstelugu #janasena