ఇక వర్షాలే ...!

నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు పడుతున్నాయి. ఏపీలో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. పిడుగులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇటు తెలంగాణలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం అంచనా వేసింది. వచ్చే రెండు రోజులు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. వాతావరణ శాఖ వర్షాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఉత్తర తెలంగాణ ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా ఉక్కపోత ఆగడం లేదు. మరోవైపు చాలా చోట్ల విత్తనాలు నాటుతున్నారు రైతులు.