జగన్ ని చావుదెబ్బ కొట్టిన మోడీ

ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ సర్కార్ ను టార్గెట్‌ చేసి మాట్లాడడం ఇప్పుడు వైసీపీ నాయకులను టెన్షన్‌ పెడుతోంది. మోదీ ఆరోపణలకు తాము కౌంటర్‌ ఇస్తే ఏమౌతుందో అని ఆందోళన చెందుతున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ జగన్‌ సర్కార్‌పై చేసిన విమర్శలు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు మంచి ఊపు తెచ్చాయి.

మోదీ ప్రధానంగా రాయలసీమ ముఖ్యమంత్రులపై సెటైర్లు వేయడం హాట్‌ పాపిక్ అయింది. రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారని, అయినా రాయలసీమకు ఎందుకు న్యాయం చేయలేదని మోదీ ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌ కూడా రాయలసీమకు చెందినవాడు కావడంతో మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాయలసీమ యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని మోదీ ఆరోపించారువైసీపీ ప్రభుత్వం పేదల వికాసం కోసం పని చేయడం లేదని, మాఫియా వికాసం కోసం పనిచేస్తుందని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో వైసీపీ నాయకులు హడలిపోతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్‌ చేసిన మోదీ ఇక్కడ రౌడీ రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. దీంతో వైసీపీ నాయకులు బిత్తరపోయారు

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత రెండుసార్లు ఏపీకి వచ్చిన మోదీ వైసీపీ సర్కార్‌ గురించి, సీఎం జగన్‌ గురించి మాట్లాడలేదు. దీంతో వైసీపీకి అనుకూలంగానే ఉన్నారని భావించారు. కానీ, ఈసారి వైసీపీని టార్గెట్‌ చేసి విమర్శలు, ఆరోపణలు చేయడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన నరేంద్ర మోదీ అనుభవం ఇప్పుడు టైం చూసి వైసీపీని టార్గెట్‌ చేయడంతో వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.