జగన్ పై రాళ్లదాడి కేసు పై కోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి కేసుపై కోర్టులో విచారణ జరిగింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్‌పై న్యాయవాది సలీం వాదనలు వినిపించారు. సతీష్ కుమార్ నిరపరాధని, అమాయకుడు సతీష్‌ని పోలీసులు కేసులో అక్రమంగా ఇరికించారని న్యాయవాది సలీం అన్నారు. సీఎం జగన్ రాజకీయ లబ్దికోసమే రాళ్ళ దాడి అంటూ డ్రామాకి తెరతీసారని న్యాయవాది సలీం కోర్టుకు వెల్లడించారు. గతంలో కోడికత్తి కేసు, ఇపుడు రాళ్ళ దాడి కేసులో ఇద్దరు అమాయకులను అక్రమంగా జైలు పాలు చేశారని తెలిపారు. వాదనల అనంతరం 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ఆర్డర్స్ రిజర్వ్ చేసింది. రేపు న్యాయమూర్తి ఆర్డర్స్ ఇవ్వనున్నారు.