కెసిఆర్ అత్యవసర భేటీ వెనుక కారణం ఏంటి ?

వెనకటికి ఎవడో అన్నాడట  నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని ,పదవిలో ఉండగా ఆంధ్ర సీఎం జగన్ లా కక్షసాధింపుతో  తన మార్కు పాలన చేసాడు కెసిఆర్ అంటే నిజమనే అంటారు  రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు బడాబడా నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోవడం.. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తం అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. మరికాసేపట్లోనే ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌కు బయలుదేరారు.ఇప్పటి ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పార్టీని వీడుతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆయన డిల్లీకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఆయన నియంత్రణా చర్యలకు దిగారు.

అయితే ఇప్పుడు ఏంటి దిక్కు ?

ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న పరిస్థితుల్లో నేటీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ సమావేశంలో ఎంత మంది ఎమ్మెల్యేలు పాల్గొంటారనేది ఉత్కంఠగా మారింది. పార్టీ నేతలకు భరోసా కల్పించడం, భవిష్యత్ వ్యూహంపై ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అయితే నేతలకు ఎలాంటి హామీలు, కాంగ్రెస్ వైపు చూడకుండా ఏవిధంగా అడ్డుకట్ట వేస్తారనేది చూడాల్సి ఉంది. కాగా ఇవాళ జరగనున్న అత్యవసర భేటీకి రావాలంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రత్యేక పిలుపునిచ్చారు. గ్రేటర్ ఎమ్మెల్యేల్లో ఎవరినీ చేజారకుండా చూసుకోవాలని ఆయన యోచిస్తున్నారు. దీంతో నేటి భేటీకి రావాలంటూ ఎమ్మెల్యేలు వివేక్, మాధవరం కృష్ణా రావు, అరికేపుడి గాంధీ, మాగంటి గోపి, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లను కేసీఆర్ పిలిచా