కూటమి ప్రభుత్వం పై యాంకర్ రష్మీ షాకింగ్ కామెంట్స్
నంద్యాల జిల్లాలో చోటు చేసుకున్న దారుణం పై యాంకర్ రష్మీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి , ఎనిమిదేళ్ల బాలికపై హైస్కూలు విద్యార్థులు ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిన విషయమే. ఆపై బాలికను కాల్వలోకి తోసేసి వెళ్లిపోయారు. బిడ్డ కనిపించలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫైల్ చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. జాగిలాలను రంగంలోకి దింపడంతో ఈ ఘోరం బయటపడింది.జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలిక మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. బాలిక అదృశ్యంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు పోలీసులకు బాలిక మృతదేహం లభించింది. దీంతో బాలిక స్కూల్ చదివే విద్యార్థులను ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. ఆ ఇంట్లోని ముగ్గురు బాలురు కూడా బాలిక చదివే పాఠశాలలోనే ఆరు, ఏడో తరగతి చదువుతున్నారు.దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు వెల్లడించారు. బాలికపై తాము అత్యాచారం చేశామని ఆ ముగ్గురు బాలురు తెలిపారు. ఆ తర్వాత భయపడి బాలికను చంపి కాల్వలో పడేశామని పోలీసులకు చెప్పారు. అయితే బాలిక మృతదేహంపై ఇప్పటి వరకు లభ్యం కాకపోవడంపై పోలీసులు తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి. బాలిక రేప్‌పై స్పందించిన సింగర్ చిన్మయి..స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకురావాల్సిన ఎమర్జెన్సీ టైమ్ వచ్చిందని చెప్పింది.ఇకనైనా ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచించాలని చిన్మయి సూచించారు. తాజాగా ఈ ఘటనపై యాంకర్ రష్మీ స్పందించారు. వాళ్లు పెద్దవాళ్ల లాగా రేప్ చేయగలిగితే వాళ్లని పెద్ద వాళ్ళ లాగానే శిక్షించాలి వాళ్ళు చేసిన తప్పుకు ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు కాబట్టి వాళ్ళు కచ్చితంగా మైనర్లు అయితే కాదు మైనర్లు అనే ఒక కార్డుతో వాళ్ళు తక్కువ శిక్షతో బయటపడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె ట్యాగ్ చేశారు. సెలబ్రిటీలు సైతం ఈ ఘటనపై స్పందిస్తుండటంతో ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగినట్టు అయింది.
Comments
0 comment