లోకేష్ ని టార్గెట్ చేస్తూ మంగళగిరిలో ఎన్ని నామినేషన్స్ వేసారో తెలుసా ?

పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్  ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండోసారి బరిలో దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనా.. గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకున్నారు. ఎలాగైనా అక్కడ విజయం సాధించి తీరాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే ఈసారి కూడా లోకేష్ ను ఓడించాలని జగన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి రప్పించిన గంజి చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. అయితే లోకేష్ ను ఢీ కొట్టాలంటే అతడు సరిపోరని భావించారు. చివరకు మురుగుడు లావణ్య కు టికెట్ ఇచ్చారు.అయితే ఈ ఎన్నికల్లో లోకేష్ ను మట్టి కరిపించేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలడం లేదు. అందుకే ఇక్కడ ఓటర్లలో ఒక రకమైన గందరగోళం సృష్టించేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులతో అధికార పార్టీ నామినేషన్లు వేయించినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా.. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఏకంగా 65 నామినేషన్లు దాఖలు కావడం విశేషం.అక్కడ విపరీతమైన పోటీ ఉందని చెప్పడంతో పాటు ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఒక్క లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలోనే రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలు కావడం విశేషం. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 22 నామినేషన్లు దాఖలయ్యాయి. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో 19, బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురంలో 19 నామినేషన్లు దాఖలు కాగా.. మంగళగిరిలో ఏకంగా ఆరుపదులు దాటడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ ను వారు ఏ స్థాయిలో టార్గెట్ చేసుకున్నారో అర్థమవుతోంది.