మంత్రి పెది రెడ్డికి షాక్

ఆంధ్రలో ఎన్నికలవేళ అధికారులపై బదిలీ వేటు పడుతోంది. గత రెండు వారాలుగా పదుల సంఖ్యలో అధికారులకు బదిలీ జరిగింది. బిజెపి రాజేంద్రనాథ్ రెడ్డి తో పాటు అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిపై బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లోపు మరిన్ని బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో వివాదాస్పద అధికారులపై పెద్ద ఎత్తున ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో వారందరిపై బదిలీ వేటు ఖాయమని ప్రచారం జరుగుతోంది.తాజాగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఇద్దరు పోలీస్ అధికారులపై బదిలీ వేటు పడింది. చిత్తూరు జిల్లా పలమనేరు డి.ఎస్.పి మహేశ్వర్ రెడ్డి తో పాటు సదుం ఎస్సై మారుతి పై ఈరోజు ఈసీ బదిలీ వేటు వేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు అందాయి. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పోటీ చేస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పై తాజాగా దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. ఆయన అనుచరులకు సైతం దెబ్బలు తగిలాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ఈసీ.. ఈ ఇద్దరు అధికారులను బాధ్యులు చేస్తూ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఎలక్షన్ కమిషన్ వేటు వేసింది. ఆయన స్థానంలో గుప్త డిజిపిగా నియమితులయ్యారు. మరోవైపు సిఎస్ జవహర్ రెడ్డి పై సైతం వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. దాదాపు జగన్ అస్మదీయ అధికారులపై విపక్షాలు టార్గెట్ పెట్టుకున్నాయి. వారిపై ఎలక్షన్ కమిషన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నాయి. మరోవైపు బిజెపి అగ్రనేతలు ఏపీకి క్యూ కడుతున్నారు.ఈ తరుణంలోనే పెద్ద ఎత్తున అధికారుల బదిలీ జరుగుతోంది. మరోవైపు ఎన్నికలు సవ్యంగా జరిగే స్థితిలో లేవని.. అధికారులపై వరుస పెట్టి బదిలీ వేటు వేస్తున్నారని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వరుస పెట్టి పోలీస్ అధికారుల బదిలీ.. అధికార వైసీపీలో ఆందోళన కనిపిస్తోంది.