ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే స్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి.
సకల దేవతాగణములకు అధిపతి విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి.
అంతే కాదు
ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే స్వామి అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి.
స్వయంభుగా వెలసిన గణపతి క్షేత్రాలలో ఒక ప్రత్యేకత కలిగిన ఆలయం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం.
భారతదేశ పశ్చిమ తీరం నుండి తూర్పు తీరం వరకు విస్తరించి జీవనంగా ప్రవహిస్తున్న గోదావరి నది రాజమండ్రి తరువాత సప్త ఋషులు సాక్షిగా సప్త గోదావరిగా ప్రవహిస్తున్న గౌతమీ నది తీరాన పచ్చని పంట పొలాలు , అందాల కోనసీమ కొబ్బరి తోటలో నడుమ అయినవిల్లి గ్రామంలో స్వర్ణ గణపతి యజ్ఞం నుండి ఉద్భవించి, తీరం వైపున దక్షిణాభిముఖుడై తూర్పున వాయుగుండం చూస్తున్నాడు. ముచ్చటైన ఉదరముతో భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్నారు. ఈ క్షేత్రం అతి చిన్న ప్రాంగణం నాలుగు మాడవీధుల ఆలయం చుట్టూ ప్రాకార మండపం తూర్పు మరియు దక్షిణ రాజగోపురంతో చూడ చక్కటి అందాలతో అలరాలుతున్నటువంటి క్షేత్రం
సహజంగా గిరులపై లేదా నదీ తీరాలలో వెలసిన స్వయంభు క్షేత్రాలు చాలా ప్రసిద్ధి. ఈ ఆలయం చాలా పురాతనమైనది దక్ష ప్రజాపతి యజ్ఞ ప్రారంభంలో శ్రీ విఘ్నేశ్వర ఆరాధన చేయకుండా యజ్ఞం (నిరీశ్వర యాగం) ప్రారంభించినందుకే శివుని ఆగ్రహానికి గురై యజ్ఞం భంగం జరిగిందని , అలా యజ్ఞభంగం జరగటం మానవాళికి క్షేమం కాదని దేవతలందరూ మహావిష్ణువుని ప్రార్థించి పరిష్కార మార్గం సూచించమని కోరిన తరువాత సకల దేవతలు సూచన మేరకు దక్ష ప్రజాపతి అయినవిల్లి స్వయంభు గణపతి క్షేత్రానికి విచ్చేసి గణపతి ఆరాధన చేసిన తదుపరి యజ్ఞం పునః ప్రారంభం చేసి నిర్విఘ్నంగా పూర్తి చేశారని పురాణ ఇతిహాస రూపంలో తెలియచున్నది.
శ్రీ దత్తాత్రేయ మరు రూపమైన శ్రీపాద వల్లభ స్వామి వారు చరిత్ర ఆధారంగా పూర్వకాలంలో మహాఋషులు చేసిన స్వర్ణ గణపతి మహా యజ్ఞము నందు ఋషుల యొక్క అభీష్టం మేరకు యజ్ఞం చివరిలో స్వర్ణమయ కాంతులతో శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు దర్శనమిచ్చి ఆహుతిని స్వయంగా స్వీకరించారు.. . ఈ యజ్ఞమును అపహాస్యము చేసిన ముగ్గురు దేవతలు చెవిటి , మూగ , గుడ్డివారిగా శాపగ్రస్థులు అయ్యారు ఆ తరువాత శరణు వేడగా కాణిపాక వినాయకుడి ఆవిర్భావమునకు కారకులు అయి శాప విముక్తి పొందినారు కాబట్టి ఈ స్వామి వారు ఆది గణపతి అయినవిల్లి గణపతి గా ప్రసిద్ధి గాంచారు అని ప్రతీతి. కాలక్రమేణా విజయనగరం , పెద్దాపురం , పిఠాపురం సంస్థానం పాలన కాలంలో ఈ ఆలయాన్ని పలుమారులు పునః నిర్మాణం చేసి స్వామి వారి కైంకర్యముల నిమిత్తం భూములు సమర్పించారు. ఈ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా శ్రీ కాలభైరవ స్వామి , శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి , శ్రీ కేశవ స్వామి ఆలయాలు ఉప ఆలయాలుగా కొలువై ఉన్నాయి.
ఇక్కడ స్వామి వారికి ముడుపులు ,తులాభారం ,అన్నప్రాసన ,అక్షరాబ్యాసం మొదలైన కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలో చెయ్యడం వలన పిల్లలు ఉన్నత విద్యావంతులుగా,ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని ఇక్కడ భక్తుల విశ్వాసం అందుకే ప్రతి రోజు ఆయాకార్యక్రమాలు ఇక్కడ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ అయినవిల్లి క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసే భక్తులకు రాజమహేంద్రవరం వరకు రైలు లేదా విమాన మార్గాలు కలవు , రాజమహేంద్రవరం నుండి అయినవిల్లి లేదా సమీపంలోని బస్సులు అధికంగా లభించే ముక్కామల గ్రామం వరకు బస్సు సౌకర్యం కలదు.
అంతే కాదు
సుదూర ప్రాంతాల నుండి ఈ క్షేత్రానికి విచ్చేస్తే భక్తులకు వసతి ఉచితంగా లేదా రుసుముతో కూడిన ప్రత్యేక వసతి కలదు.ప్రతినిత్యం దర్శనం చేసుకున్న భక్తుల ప్రతీ ఒక్కరికీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల విరాళాలతో నాణ్యమైన , రుచికరమైన ఉచిత అన్న ప్రసాదం అందించబడుతుంది.
ఇక అయినవిల్లి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళితే చుట్టుప్రక్కల అతి చేరువలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు అవి ఏమిటో ఇక్కడ చూద్దాం
క్షేత్ర పురాణ నిదర్శనంగా ఈ క్షేత్రానికి ఉత్తర దిక్కున 15 కి.మీ దూరంలో ప్రసిద్ధిగాంచిన పంచారామ క్షేత్రం , అష్టాదశ పీఠం శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి క్షేత్రం , దక్షారామం , కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి వారి క్షేత్రం , తూర్పు దిక్కున 20 కి.మీ దూరంలో ఉన్న మురమళ్ళ శ్రీ భద్రకాళి స్వామి వారి క్షేత్రం శ్రీ భద్రకాళి 5 కి.మీ. దూరంలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రం , పశ్చిమ దిక్కున 30km దూరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం , మరియు ర్యాలి గ్రామంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి క్షేత్రం , ఇదే గ్రామంలో ముక్తిని ప్రసాదించే శ్రీ క్షణ ముక్తీశ్వర స్వామి వారి క్షేత్రం కలవు.
మరి మీరుకూడా అయినవిల్లి విగ్నేశ్వర స్వామి వారిని దర్శించుకోండి సర్వకార్యములయందు జయాన్ని పొందండి
Comments
0 comment