ఓడిపోయాక నాయకులకు అప్పాయింట్ మెంట్ లేకుండా కలుస్తున్న జగన్

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను కలవాలంటే ఒక ప్రహసనమే. అపాయింట్మెంట్ తీసుకుంటే కానీ కుదిరే పని కాదు. అయితే ఇది అందరికీ కాదు. కొద్దిమందికి మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చేవారు. తనకు ఎంపీగా పోటీ చేయాలని ఉందని.. ఆ మాట చెప్పేందుకు జగన్ అపాయింట్మెంట్ కోరితే ఇవ్వలేదని.. అందుకే తాను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయానని.. సాలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న కోటరీ కొంప ముంచిందని జక్కంపూడి రాజా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వంటి వారు బాహటంగానే చెప్పుకొస్తున్నారు. అయితే ఉన్నప్పుడు అలా వ్యవహరించారు జగన్. నాలుగు రోజుల కిందట ఓటమి ఎదురయ్యేసరికి ఇప్పుడు జగన్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ అవసరం లేదు. నేరుగా చాలామంది వచ్చి కలిసి వెళ్తున్నారు. గతంలో ఈ పరిస్థితి ఉంటే.. ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేది కాదు కదా అన్న కామెంట్స్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి.ఒకప్పుడు సొంత పార్టీ నాయకులను కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్. కానీ కాలం మారింది. దారుణ పరాజయం పలకరించింది. ఇప్పుడు పెద్దగా పని లేకపోవడంతో ఎవరు వచ్చినా కలుస్తున్నారని తెలిసింది. తాడేపల్లి కోటలో రాజుల భావించి జగన్ ఎవరితో కలిసేందుకు ఇష్టపడేవారు కాదు. ఎవరినీ తన దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు అందరితో మాట్లాడుతున్నట్లు సమాచారం. జగన్ లో ఈ మార్పు చూసి వైసిపి నేతలు సైతం షాక్ అవుతున్నారు. ఎంతలో ఎంత మార్పు అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు.

 

2019 ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించారు జగన్. అదంతా తన సొంత విజయం అని భావించారు. ఎమ్మెల్యేలంతా తన ఫోటోతో గెలిచారన్నది జగన్ ఆలోచన. అందుకే గెలిచిన తరువాత చుట్టూ కోటరీని ఏర్పాటు చేసుకున్నారు. తాను ఒక రాజు నన్న రీతిలో నియంతృత్వ పోకడలకు వెళ్లిపోయారు. సొంత పార్టీ నేతలను కలిసేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. పార్టీ ఎమ్మెల్యేలు అపాయింట్మెంట్ కోరినా దక్కేది కాదు. వైసీపీలో ఇదొక ప్రధానమైన అసంతృప్తి కూడా.అయితే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కు నేరుగా ఎవరైనా వెళ్ళవచ్చు. అపాయింట్మెంట్ అవసరం లేదు. వస్తున్నామని సమాచారం ఇస్తే చాలు. గత మూడు రోజులుగా చాలామంది వైసిపి నేతలు ప్రతిరోజు జగన్ ను కలుస్తున్నారు. వీళ్ళు ఎవరు అపాయింట్మెంట్ కోరడం లేదు. గత ఐదు సంవత్సరాలుగా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని.. కనీసం మంత్రుల ద్వారా కలిసేందుకు ప్రయత్నించిన వీలుపడేది కాదని.. ఈ ఓటమితో నైనా పార్టీ నేతలు, కార్యకర్తలతో జగన్ కు కలిసే అవకాశం వచ్చిందనే సెటైర్లు పడుతున్నాయి.