పాపం పెద్దిరెడ్డి

పెదిరెడ్డి గత 5 సంవత్సరాలలో ఆడింది ఆట పాడింది పాత అలాంటిది ,మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దహనం కేసు విచారణలో వెలుగులోకి వస్తున్న విషయాలన్నీ పెద్దిరెడ్డి ప్రమేయాన్నే సూచిస్తున్నాయి.  మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు సంఘటన జరిగిన నాటి నుంచీ బలంగా వ్యక్తం అయ్యాయి. దీంతో అగ్నిప్రమాదం, ఫైళ్ల దగ్ధం సంఘటనను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు సర్కార్ విచారణకు ఆదేశించింది.దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. వారి విచారణలో  భాగంగా ఈ ఫైళ్ల దగ్ధం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి ప్రమేయం ఉందన్న అనుమానాలు బలంగా వ్యక్తమౌతున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పెద్ద రెడ్డి అనుచరులు, వ్యక్తిగత సిబ్బందిని పోలసులుసు అరెస్టు చేశారు.  అరెస్టయిన వారిలో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు , వైసీపీ నేత మాధవ్ రెడ్డి  కూడా ఉన్నారు. అలాగే  పెద్దిరెడ్డి పీఏ శశికాంత్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.  అంతకు ముందు శశికాంత్ ఇంటిలో సోదాలు చేపట్టిన పోలీసులు కీలక పత్రాలతో పాటు 2 ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నారు.  మరోవైపు పెద్దిరెడ్డి మంత్రిగా పని చేసినప్పుడు అధికారిక పీఏగా పని చేసిన తుకారాం  అరెస్ట్ భయంతో  పరారిలో ఉన్నారు. అయితే తిరుపతిలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అలాగే పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్ళలోనూ సోదాలు నిర్వహించారు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి అండతో ఆయన కోటరీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఒక్కొక్కటిగా భూకబ్జాల బాగోతం బయటకు వస్తుండటంతో పాటు మదనపల్లె పైల్స్ దహనం ఫైర్ యాక్సిడెంట్ కాదని తేలడంతో పెద్దిరెడ్డి చిక్కుల్లో పడ్డట్టేనని చెబుతున్నారు. అధికారం అండతో ఇష్టారీతిగా అక్రమాలు, ఆక్రమణలకు పాల్పడిన పెద్దరెడ్డి పాపం బద్దలైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.