పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ వద్ద ప్రజాప్రతినిధులందరినీ చంద్రబాబు పలకరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ నుంచి స్పిల్ వే ను పరిశీలించారు సీఎం

 

.