ప్రక్షాళన మొదలు పెట్టిన చంద్రబాబు
చంద్రబాబు తన మార్కు పాలన మొదలుపెట్టారు ,ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధివైపు అడుగులు వెయ్యడం మొదలు పెట్టింది స్కిల్ సెన్సెస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన డేటా ప్రకారం.. రాష్ట్రంలో.. ఫైనాన్స్ విభాగం వారు ఇంత మంది ఉన్నారు.. ఎలక్ట్రికల్ విభాగం వారు ఎంత మంది ఉన్నారు.. ఐటీ రంగంలో పనిచేస్తున్నవారు ఎంత మంది ఉన్నారు.. ఇలా ఇతర రంగాల్లో ఏ విభాగంలో ఎంతమంది ఉన్నారు..? వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారనే విషయాలు ప్రభుత్వం వద్ద ఉంటాయి. వీటిని కంపెనీల ప్రతినిధుల ముందుఉంచి మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడితే ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాల సహకారం అందించడంతోపాటు.. మీకు కావాల్సిన ఉద్యోగులుకూడా అందుబాటులో ఉంటారని లెక్కలతో సహా వివరిస్తుంది. మీరు మంచి జీత భత్యాలు ఇవ్వగలిగితే ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారు స్వరాష్ట్రానికి వచ్చి ఉద్యోగం చేసుకుంటారు. అంతే కాదు.. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారుకూడా ఉన్నారని ప్రభుత్వం కంపెనీల ప్రతినిధులకు తెలియజేస్తుంది. లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే ఏ కంపెనీ నిర్వాహకులకైనా ప్రభుత్వం నుంచి సహకారంతోపాటు, వారికి కావాల్సిన విభాగాల్లో ఉద్యోగస్తులు అందుబాటులో ఉన్నారంటే అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు. దీంతో పాటు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్లి 50వేల నుంచి లక్ష జీతంతో ఉద్యోగం చేస్తున్న వారు సొంత రాష్ట్రంలో అదే జీతంతో ఉద్యోగం దొరుకుతుందంటే తప్పకుండా స్వరాష్ట్రానికి వచ్చేస్తారు. ఇలా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఐదో సంతకం చేసిన స్కిల్ సెన్సెస్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించబోతున్నది. ఒక విధంగా చెప్పాలంటే.. బీసీ జన గణన కంటే స్కిల్ సెన్సెస్ దేశంలో కీలకంగా మారే అవకాశం ఉంది. బీసీ జనగణన అనేది రాజకీయ లబ్ధి కోసం చేసేది.. స్కిల్ సెన్సెస్ అనేది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది. మొత్తానికి చంద్రబాబు నాయుడు అమల్లోకి తీసుకురాబోతున్న స్కిల్ సెన్సెస్ కార్యక్రమం దేశానికే ఆదర్శంగా మారబోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Comments
0 comment