పవన్ చేపట్టనున్న వారాహి దీక్ష ,షెడ్యూల్ లో స్వల్ప మార్పులు ?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి,కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అంతో కృషి చేశారు ,ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక డిప్యూటీ సీఎం గా భాద్యతలు స్వీకరించారు,తరువాత  నుండి  కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతతో బిజీగా ఉన్నారు. వరుసగా సమీక్షలు, సమావేశాలు, ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నారు. అటు సినీ పరిశ్రమ పెద్దలు వచ్చి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా బిజీగా ఉన్న పవన్ ఈనెల 26 నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. 11 రోజులపాటు దీక్షలో ఆయన కొనసాగునున్నారు. దీక్షలు ఉన్నన్ని రోజులు పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు

2023 జూన్ లో పవన్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ యాత్రల కోసం ప్రత్యేక వాహనం తయారు చేయించుకున్న పవన్ కళ్యాణ్ దానికి వారాహి అని పేరు పెట్టారు. నాడు యాత్ర సందర్భంగా వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. తాజాగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో మరోసారి అమ్మవారి దీక్షకు దిగనున్నారు పవన్.రేపటి నుంచి వారాహి దీక్షలో పవన్ గడపనున్నారు. ప్రస్తుతం పవన్ వద్ద నాలుగు శాఖలు ఉన్నాయి. దీంతో క్షణం తీరిక లేకుండా పవన్ గడుపుతున్నారు. అటు దైనందిన కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ దీక్ష పూర్తి చేయనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. నిన్ననే క్యాబినెట్ భేటీకి హాజరయ్యారు పవన్. అటు ఖాళీ సమయంలో క్యాంప్ కార్యాలయం వద్దనే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వినతుల స్వీకరిస్తున్నారు. అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇస్తూ ప్రజలలో వుండే నాయకుడుకి అధికారం ఇస్తే ఇలా వుంటుందా అని నివ్వెర పోతున్నారు ,ఇక  రేపటి నుంచి పవన్ దీక్ష ఉండడంతో.. రోజువారి షెడ్యూల్లో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం ఉందని ఆయన క్యాంపు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.