పవన్ కళ్యాణ్ నాగబాబు కి ఇచ్చిన సీటు ఇక్కడే ..!

జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీ చేస్తారా? చేస్తే ఏ నియోజకవర్గం నుంచి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఇదివరకే నాగబాబు ప్రకటించారు. పార్టీ వ్యూహాలు, ప్రచారంలో మాత్రమే పాల్గొంటానని చెప్పుకొచ్చారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకోవడం వల్ల విజయావకాశాలు మెరుగుపడ్డాయని తెలియడంతో.. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని భావిస్తున్నారు.ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. కానీ సొంత నియోజకవర్గంలో ఓడిపోయి తిరుపతిలో గెలిచారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారు. రెండింట ఓడిపోయారు. నాగబాబు నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఒక్క చిరంజీవి తప్ప సోదరులు ఇద్దరూ చట్టసభలకు ఎన్నిక కాలేదు. అయితే ఈసారి పవన్ తో పాటు నాగబాబు సైతం చట్టసభలకు ఎన్నిక కావాలని బలమైన ఆకాంక్షతో ఉన్నట్లు తెలుస్తోంది.నాగబాబు ఎన్నికల్లో పోటీ చేస్తే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఎంపీగా గెలిచి నాగబాబు జాతీయస్థాయిలో పార్టీ వ్యవహారాలు నడిపితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

1121-entry-1-1707288380.jpg

అయితే నాగబాబుకు ఇప్పుడు ఒక నియోజకవర్గం అవసరం. పొత్తులో భాగంగా జనసేనకు మచిలీపట్నం తో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని టిడిపి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీష్ కుమార్ కు కాకినాడ లోక్ సభ స్థానం కేటాయించినట్లు తెలుస్తోంది. పోనీ నరసాపురం లోక్ సభ స్థానాన్ని కేటాయిద్దామంటే అక్కడ రఘురామకృష్ణం రాజు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి అయితే నాగబాబుకు సేఫ్ జోన్ అవుతుందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. పొత్తులకు సంబంధించి మలి విడత చర్చల్లో చంద్రబాబు వద్ద అనకాపల్లి విషయం తేల్చుకోనున్నట్లు తెలుస్తోంది.మరోవైపు అనకాపల్లి ఎంపీ స్థానానికి టిడిపిలో విపరీతమైన పోటీ ఉంది. అక్కడ చింతకాయల విజయ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు బైరి దిలీప్ చక్రవర్తి అనే నేత సైతం చంద్రబాబుకు ప్రత్యేకంగా విన్నవించారు. చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నాగబాబు ఎంట్రీ కావడం విశేషం. ఒకవేళ పవన్ పట్టుబడితే టిడిపి నేతలందరినీ సమన్వయపరిచి.. అనకాపల్లి సీటును నాగబాబుకు కేటాయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీ సీటును ఆశించి జనసేనలో చేరారు. ఆయనకు సైతం సముచిత స్థానం కల్పిస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఈ తరుణంలో అనకాపల్లి సీటు నుంచి కొణతాలకు ఛాన్స్ ఇస్తారా? లేకుంటే నాగబాబు కోసం పట్టుబడతారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే అనకాపల్లి విషయంలో చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి పవన్ అడిగితే చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.