పవన్ కు బ్రహ్మరధం పడుతున్న పిఠాపురం నియోజక వర్గం
దేశం లో పిఠాపురం ఇప్పుడు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది గత మూడు రోజులుగా ఆయన తాను పోటీ చేయనున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వరుసగా పర్యటనలు చేస్తున్నారు. ఎస్సీ కాలనీలతో పాటు తీర గ్రామాలలో ప్రజలతో మమేకమవుతున్నారు. మండుతున్న ఎండను సైతం లెక్కచేయడం లేదు. అటు ప్రజల సైతం పవన్ ని చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. స్వయంగా తమ గ్రామానికి, తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. పవన్ సైతం ఎంతో ఓపికతో ప్రతి ఒక్కరిని కలిసేందుకు, వారితో ఫోటో దిగేందుకు మొగ్గు చూపుతున్నారు. పవన్ పర్యటనకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తుండడాన్ని చూసి అధికారపక్షం షాక్ అవుతోంది.గతంలో పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే నియోజకవర్గానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదు. గత ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు భీమవరంలో పోటీ చేశారు. సొంత నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు పరిమితం అయ్యారు. అదే సమయంలో వైసిపి పట్టు బిగించింది. అప్పట్లో మరో విపక్షం టిడిపి సైతం భారీగా ఓట్లు చీల్చింది. దీంతో పవన్ కు రెండు చోట్ల ఓటమి ఎదురైంది. అందుకే పవన్ ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి గ్రామాన్ని టచ్ చేసేలా ప్రణాళిక రూపొందించారు. గత మూడు రోజులుగా క్షణం తీరిక లేకుండా నియోజకవర్గంలో కలియతిరిగారు.అయితే పవన్ ప్రజలతో డైరెక్ట్ గా మమేకం అవుతున్నారు. చివరకు ఎస్సీ గ్రామాల్లో సైతం నేరుగా ప్రజల వద్దకు వెళుతున్నారు. వారితో కాసేపు ముచ్చటిస్తున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో ప్రతి ఒక్కరిలో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. పవన్ కు ఓటు వేయాలన్న ధ్యాస, ఆయనకు తప్ప మరొకరికి వెయ్యమన్న మాట వినిపిస్తోంది. సహజంగానే ఇది అధికార పార్టీకి కలవరపాటుకు గురిచేసే అంశం. 90 వేలకు పైగా కాపు ఓటర్లు, టిడిపికి సంస్థాగత బలం, పవన్ క్రేజ్, ప్రభుత్వ వైఫల్యం తదితర కారణాలతో జనసేనకు ఇక్కడ లక్ష ఓట్ల మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే పదే పదే పవన్ లక్ష మెజారిటీ అంటూ కొత్త పల్లవి అందుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే పిఠాపురంలో పవన్ ప్రచార శైలి చూస్తుంటే అలానే అనిపిస్తోంది.
Comments
0 comment