రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం మధ్యాహ్నం 11.27 గంటలకు కృష్ణాజిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన ప్రాంగణంలో చంద్రబాబు చేత రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, సినీ, రాజకీయ, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులు 24 మంది ఈసందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు.