సంక్రాంతికి ఆంధ్రా కి వస్తున్న రఘురామ కృష్ణం రాజు ,జగన్ ప్రభత్వం అరెస్ట్ చేస్తుందా ?

రఘురామకృష్ణం రాజు ,వైసీపీ తప్పులను ఎత్తి చూపి అదే పార్టీలో వుంటూ ఆ పార్టీకే ఏకు మేకై కూర్చున్నాడు ,ఇపుడు ఆంధ్రలో ప్రవేశించగానే అరెస్ట్ విచేస్తరన్నా వాదనలు వినపడటం తో  తాజాగా  ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతి పండుగకు నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకోవడానికి రాష్ట్రానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. చట్ట నిబంధనలను పాటించేలా వారిని ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రఘురామపై 11 తప్పుడు కేసులు పెట్టారని లాయర్లు వాదనలు వినిపించారు. కేసులు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వానికి వేరే పనిలేకుండా పోయిందన్నారు. పిటిషనర్‌ను ఓ కేసులో అరెస్టు చేసి తీవ్రంగా కొట్టి చావు అంచుల వరకు తీసుకెళ్లారన్నారు.ప్రాథమిక హక్కులకు విఘాతం కలుగుతుందనే హైకోర్టును ఆశ్రయించారన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్ట నిబంధనలు పాటించేలా, అర్నేష్‌కుమార్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని.. అందువల్ల పోలీసులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోర్టును అభ్యర్థించారుపిటిషనర్‌ది ఆందోళన మాత్రమేనని.. . పిటిషనర్‌పై తాజాగా ఎలాంటి కేసూ నమోదు కాలేదని పోలీసుల తరఫున హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు.రఘురామపై కేసు నమోదై, అది ఏడేళ్ల లోపు శిక్ష ఉన్న సెక్షన్లు అయితేనే 41 ఏ నిబంధనలు వర్తిసాయన్నారు. కేసు నమోదు కానప్పుడు సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ నోటీసు ఇవ్వాలని.. చట్ట నిబంధనలను పాటించేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్‌ కోరలేరని చెప్పారు. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. శుక్రవారం తగిన ఉత్తర్వులిస్తామని తెలిపారు.