సూర్యుడిపై భారీ విస్ఫోటనాలు , భూమికి పొంచివున్న ముప్పు ?

ప్రకృతిలో మార్పు మానవుడు తట్టుకోగలడా ? కానీ ప్రకృతుకి మానవుడు ఎప్పుడు హాని చేస్తూనే ఉంటున్నాడు ,అగ్నిగోళం.. ప్రకాశించే వాయువుగా కనిపించే సూర్యుడు.. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి కొత్త సౌర చక్రంలోకి ప్రవేశిస్తాడు. దీంతో సూర్యుడి అయస్కాంత క్షేత్రం మారుతుంది. అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం తమ స్థానాలను మార్చుకుంటాయి. తద్వారా ఏర్పడే కొత్త సౌర వ్యవస్థలో గ్రహాలు కూడా భాగం అవుతాయి. సూర్యుడు, భూమి మధ్య సంబంధం గ్రహం మీద జంతువులు, జీవవైవిధ్యం, సముద్ర ప్రవాహాలు, వాతావరణాన్ని నడిపిస్తుంది. కాగా, ప్రస్తుతం నడుస్తోన్న సౌర చక్రంలో కార్యకలాపాలు తీవ్రస్థాయికి చేరుకోవడం.. సూర్యుడి నుంచి విడుదలవుతోన్న అనేక సౌర తుఫానులతో భూమిపై సాధారణ జీవరాశి ప్రభావితమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.రెండు రోజుల కిందట సన్‌స్పాట్ AR3663 వద్ద అత్యంత శక్తివంతమైన రెండు విస్ఫోటనాలు సంభవించినట్టు తెలిపారు. వీటి వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే 2న మొదటి విస్ఫోటనం సంభవించిందని, ఇది ‘X’- తరగతికి చెందిన సౌరజ్వాల అని వివరించారు. సౌర జ్వాలల్లో ఇది అత్యంత శక్తివంతమైంది.. ఇది ఆస్ట్రేలియా, జపాన్, చైనాలో చాలా వరకు షార్ట్‌వేవ్ రేడియో బ్లాక్‌అవుట్‌లకు కారణమవుతుందిసన్‌స్పాట్ AR3663 ప్రాంతం X1.7(X FLARE) సౌరజ్వాలను విడుదల చేసింది.. ఇది ఇప్పటివరకు ఈ సౌరచక్రంలో 11వ అతిపెద్ద జ్వాల.. మొత్తం 25 నిమిషాల పాటు మండిన ఈ జ్వాల అంతర్జాతీయ ప్రామాణిక కాలమానాన్ని అనుసరించి 2.22 నిమిషాల వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది’ అని భౌతిక శాస్త్రవేత్త కీత్ స్ట్రాంగ్ ఎక్స్(ట్విట్టర్)‌లో తెలిపారు. మే 3న విడుదలైన రెండో జ్వాలను ‘M’-క్లాస్‌గా Space.com పేర్కొంది.కొత్తగా పుట్టుకొచ్చిన సన్‌స్పాట్ సూర్యుని ఉపరితలంపై అనేక సౌర జ్వాలల విస్ఫోటనానికి కారణమైంది.. రెండు విస్ఫోటనాల సమయంలో సన్‌స్పాట్ భూమికి ఎదురుగా ఉంది.. వీటిల్లోని ఒకదాంట్లో కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME) ఉండొచ్చు.. కరోనల్ మాస్ ఎజెక్షన్ వల్ల భూమిపై పవర్ గ్రిడ్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు, ఉపగ్రహాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. వ్యోమగాములను కూడా ప్రమాదకరమైన రేడియేషన్‌కు గురి చేస్తుంది’ స్పేస్‌డాట్ కామ్ తెలిపింది.