వై.ఎస్ షర్మిల పై షాకింగ్ కామెంట్స్ చేసిన రోజా

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. దర్శనానంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ..... చంద్రబాబు నాయుడు 1998, 2008,2018 లో ఇవ్వాల్సిన డీఎస్సీలను సీఎం జగన్ వచ్చాక 17 వేల పోస్టుల భర్తీకి గుర్తు చేశారు. 6,100 భర్తీలకు సీఎం జగన్ నోటిఫికేషన్ విడుదల చేశారని కొనియాడారు.షర్మిలకు రాజకీయ అవగాహన లేదని నిన్న చేసిన హడావిడి చూస్తే అర్థమైంది. నాలుగునర్రేళ్లు ఏపీలో లేకుండా తెలంగాణ బిడ్డను అని చెప్పుకుందని... ఇప్పుడు వచ్చి జగన్ పై షర్మిల విషం చిమ్ముతూ ఆరాటాలు, పోరాటాలు చూసి ప్రజలు నవ్వుతున్నారని అన్నారు.చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని అన్నారు. వాళ్లు ఎంత మంచోళ్ళో…. వాళ్ల కుటుంబానికి పవన్ చెప్పాల్సి ఉందని. పిచ్చి మాటలు మాట్లాడటం పవన్ మానుకోవాలని సూచించారు. జగన్, షర్మిలకు సమానమైన పేరు ప్రఖ్యాతలు, ఆస్తులు పంచి పెట్టారని అన్నారు.