70 వదశకం లో కూడా రజని సినిమాలు చెయ్యడానికి గల కారణం ఏమిటో తెలుసా?

రజనీకాంత్ ఈ పేరు ఇప్పుడు ఏ ఫిలిం ఇండస్ట్రీ నైనా శాసించే పేరు,రజని తెలుగు సినిమా నుండే అక్కడకు వెళ్లినా  ,తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న హీరో,ఈయన చేసిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్ మేనరిజమ్స్ ని చాలా అద్భుతంగా చేస్తాడు. ప్రతి సినిమాలో ఒక్కొక్క మేనరిజం ను డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేస్తూ స్టైలిష్ యాక్టర్ గా కూడా పేరు ను సంపాదించుకున్నాడు.ఇక ప్రస్తుతం ఆయనకి 74 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ, ఇప్పటికీ కూడా యంగ్ హీరోలకి పోటీ ఇస్తు సినిమాలను చేస్తూ వస్తున్నాడు. గత సంవత్సరం జైలర్ సినిమాతో 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన రజినీకాంత్ ఇప్పుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే జైలర్ కి సీక్వెల్ గా మరొక సినిమాను చేస్తున్నాడు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. నిజానికి రజనీకాంత్ ఎందుకు ఈ ఏజ్ లో కూడా ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాని చేస్తూ ముందుకెళ్తున్నాడు.సినిమాలకు రిటర్మెంట్ ఇచ్చి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రజనీకాంత్ తన సినిమాల్లోకి వచ్చినపుడే తన ఎంటైర్ కెరీర్ మొత్తం సినిమాల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారంట. చివరి ఊపిరి వరకు తను సినిమాల్లో నటించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతారట. తను బెడ్ మీద పడుకొని ఉన్న పొజిషన్ లో కూడా అలాంటి పాత్ర ఏదైనా వస్తే తను అప్పుడు కూడా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం విశేషం…ఇక మొత్తానికైతే రజనీకాంత్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడనే చెప్పాలి. ఇప్పుడు రాబోయే రెండు సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లను కొడితే ఇక రజనీకాంత్ ను మించిన హీరో మరొకరు లేరు అని మరొకసారి ప్రూవ్ చేసినవాడు అవుతాడు…ఇక రజినీకాంత్ సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగు లో కూడా ఇప్పటికీ ఆడుతూ ఉండటం విశేషం…