గ్రాండ్‌గా గేమ్ ఆన్ ప్రీ గేమ్ ఈవెంట్ : ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న గేమ్ ఆన్.
కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన చిత్రం గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేసిన మాసివ్ ప్రమోషన్స్‌లో మూవీ టీమ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని దస్పల్లా హోటల్‌లో గ్రాండ్‌గా ప్రీ గేమ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాత వివేక్ కూచిభొట్ల, నటుడు శివ బాలాజీ హాజరయ్యారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల ఈ మూవీ రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. అనంతరం బిగ్ టిక్కెట్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. "ఈ సినిమా నేను చూశాను. మంచి కాన్సెప్ట్ తో చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ లా ఎక్కడా అనిపించలేదు. ప్యాక్డ్ స్క్రీన్ ప్లే తో రూపొందించారు. హీరో గీతానంద్ పర్ఫామెన్స్ బాగా చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు. మరో గెస్ట్ గా హాజరైన శివ బాలాజీ మాట్లాడుతూ.."నేను ఇండస్ట్రీకి రావడానికి మూల కారణం హీరో, డైరెక్టర్ నాన్న కుమార్ గారే కారణం. వీళ్ళిద్దరినీ నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను. దయానంద్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు అనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ప్రతి విషయాన్ని డీటెయిల్ గా చూపించాడు. గీతానంద్ పేరు వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థను చూసి ఆయనకు వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టారు. గీత ఆర్ట్స్ ఎంత సక్సెస్ అయిందో గీతానంద్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడని నమ్మకం ఉంది. నేహా సోలంకి బాగా నటించింది. టెక్నీషియన్స్ పరంగా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ బెస్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్" అని చెప్పారు.
హీరో గీతానంద్ మాట్లాడుతూ.."ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదు. రియల్ టైంలో సాగే సైకలాజికల్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సౌండ్, ట్విస్టులు, విజువల్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను చాలా కష్టాలు పడ్డాను. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలనుకున్నా. థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు ఇతర దమ్మున్న సినిమా అనుకునేలా దీన్ని రూపొందించాం. అలాంటి పవర్ ప్యాక్డ్ మూవీ ఇది. నిర్మాత రవి నాకు క్లోజ్ ఫ్రెండ్. చాలా క్వాలిటీగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. తను నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా తమ్ముడు దయానంద్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు. కమలహాసన్ విక్రమ్ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎలా మాట్లాడుకున్నారో ఇందులో కూడా అలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అభిషేక్ అందించాడు. ప్రతి క్రాఫ్ట్ నెక్స్ట్ లెవెల్ లో అవుట్ పుట్ ఇచ్చారు. థియేటర్స్ లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది" అని చెప్పారు. హీరోయిన్ నేహా సోలంకి మాట్లాడుతూ.. "ఈ ప్రాజెక్టులో భాగమవడం గర్వంగా ఉంది. ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. నా పాత్రను డిజైన్ చేసిన డైరెక్టర్ దయానంద్ గారికి థాంక్స్. ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా" అని చెప్పారు.శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ ‘పుట్టిన దగ్గర్నుంచీ చనిపోయే వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒక గేమ్ ఆడుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మనం అనుకున్నది ఒకటి.. జరిగేది ఒకటి. అలాంటి చిత్రమే ఈ ‘గేమ్ ఆన్’. ఇందులో నేను చాలా మంచి పాత్ర పోషించాను. యంగ్‌స్టర్స్ అంతా కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. వాళ్లకున్న విజన్‌కు, డెడికేషన్‌కు హ్యాట్సాఫ్. ప్రతి ఒక్కరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు. డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ.."సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. ప్రతి సీను కొత్తగా ఉండాలని ప్రయత్నిస్తూ.. ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించా. చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా ఈ కంటెంట్ గురించి మాట్లాడతారు. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే, విజువల్స్ మ్యూజిక్ పరంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. మా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ప్రేక్షకులు గెలిపిస్తారని నమ్ముతున్నాం" అని అన్నారు. నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ.."మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వివేక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సినిమా ఇంత సక్సెస్ ఫుల్ గా రావడానికి టీమ్ లోని ప్రతి ఒక్కరూ కారణం. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్ ను ఇస్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అమ్మ.. అందరూ రాసి పెట్టుకోండి" అని అన్నారు. నటులు కిరీటి, జెమిని సురేష్,మేఘన, మాక్స్ ఈ చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏ.ఆర్ మాట్లాడుతూ ‘నన్ను నమ్మి ఈ ప్రాజెక్టు ఇచ్చిన దయానంద్, గీతానంద్‌కు ధన్యవాదాలు. ఆరు నెలల పాటు ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోరు కోసం వర్క్ చేశాం’ అని చెప్పారు. చాలా కొత్తగా ట్రై చేసిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం అన్నారు ఎడిటర్ వంశీ అట్లూరి, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథన్. ఈ కార్యక్రమంలో నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్ ఇచ్చిన లైవ్ పెర్ఫార్మెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కార్యక్రమంలో పాల్గొన్న యుఎఫ్ఓ లక్ష్మణ్ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్; అభిషేక్ ఏ ఆర్, సాంగ్స్ః నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్, సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్, స్క్రిప్ట్ సూపర్ వైజర్ : విజయ్ కుమార్ సి.హెచ్, ఎడిటర్ : వంశీ అట్లూరి, ఆర్ట్ః విఠల్, యాక్షన్ కొరియోగ్రఫీః రామకృష్ణ, నభా స్టంట్స్, స్టైలింగ్ః దయానంద్, పిఆర్ఓః జి.కె మీడియా, కొరియోగ్రఫిః మోయిన్, నిర్మాత: రవి కస్తూరి, కథ-స్ర్కీన్ ప్లే-డైలాగ్స్-డైరెక్షన్: దయానంద్.
Comments
0 comment