రెండో పెళ్ళికి సిద్దమైన సమంతా ? కారణం చైతునా ?
సమంతా ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి,విశ్రాంతి తీసుకుంది ఇప్పుడు మల్లి సినిమాలతో బిజీ అయింది టాలీవుడ్ ఫిల్మ్ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్కపుల్గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య - సమంత పెళ్లైన నాలుగేళ్లకే డివొర్స్తీసుకుని అందర్ని షాక్‌కు గురి చేశారు. విడాకులు తీసుకున్నాక ఎవరి జీవితం వారు గడుపుతున్నప్పటికీ వారి గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతూనే ఉంటుంది. వాళ్లిద్దరూ మళ్లీ కలిశారనో, లేదా మరో పెళ్లి చేసుకోబోతున్నారనో.. ఇలా ఏదో ఒక గాసిప్ బయటకు రావడం అది చర్చనీయాంశంగా మారడం జరుగుతూనే ఉంటోందిఅయితే ప్రస్తుతం నాగచైతన్య - సమంత ప్రొఫెషనల్లైఫ్తోనే బిజీగా ఉన్నారు. వరుస ఫ్లాఫ్లను ఎదుర్కొంటున్న చైతూ ఈ మధ్యే దూత వెబ్‌సిరీస్‌తో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాడు. కానీ థియేటర్లో మాత్రం ఇంకా సరైన హిట్‌లేక ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం తండేల్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్చిత్రంలో నటిస్తున్నాడు. ఇక సమంత విషయానికొస్తే చివరిగా ఖుషితో పలకరించిన ఈమె కొంత కాలం నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. రీసెంట్‌గానే మళ్లీ సిటాడెల్ఇండియన్ వెబ్సిరీస్డబ్బింగ్వర్క్తో మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది.అయితే ఇదంతా మంచిగా సాగుతున్న సమయంలో మళ్లీ సడెన్‌గా సమంత పెళ్లి టాపిక్ తెరపైకి వచ్చింది. సామ్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ బయట కథనాలు తారసపడుతున్నాయి. నాగచైతన్య మీద కోపంతోనే ఈ పని చేస్తున్నట్లు ఆ కథనాల్లో రాసి ఉంది. కానీ వరుడు ఎవరు అనేది తెలీదు కానీ ప్రస్తుతం ఈ వార్త బయట వైరల్ అవుతోంది. ఈ వార్త చూసిన అభిమానులు కొంతమంది షాక్ అవుతుంటే మరికొంతమంది ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా సామ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు, వరుడు అతడే అంటూ పలు వార్తలు సోషల్‌మీడియాలో హల్‌చేశాయి. కాబట్టి తాజాగా మళ్లీ వార్తలు వస్తున్న దాంట్లో నిజమెంతో తెలియాలంటే మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే..
Comments
0 comment