శోభిత తో నాగచైతన్య పెళ్లి

మొత్తానికి అక్కినేని నాగచైతన్య ఒక ఇంటివాడవుతున్నాడు. దీంతో అక్కినేని వారి ఇంట్లోనే కాదు  అక్కినేని అభిమానుల ఇంట్లో  కూడా ఆనందోత్సవాలు వెళ్లి విరుస్తున్నాయి. ఈ రోజు ఉదయమే  చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్ మెంట్ అతి కొద్దీ మంది బంధువుల సమక్షంలో ఘనంగా  జరిగింది.  ఇప్పుడు ఈ విషయమే  టూ డే హాట్ టాపిక్. అంతే కాదు గూగుల్ కి కూడా పని ఏర్పడింది. ఈ క్రమంలో శోభిత సిస్టర్  న్యూస్ తెలిసి అందరు కొత్త రకం షాక్ కి  గురవుతున్నారు.శోభిత ధూళిపాళ్ల చెల్లెలి పేరు సమంత. ఇది నిజం. కావాలంటే మీరే చూడండి .ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా తెనాలి లో శోభిత జన్మించింది. తండ్రి పేరు వేణుగోపాలరావు. ఇండియన్  నావిలో ఉద్యోగం చేసే వాళ్ళు. మదర్ పేరు శాంత కామాక్షి . స్కూల్ టీచర్ గా వర్క్ చేసే వాళ్ళు. ఇక  శోభిత కి ఒక  సిస్టర్. ఆమె పేరునే సమంత. ఇక సమంత కూడా ఎంగేజ్మెంట్ కూడా హాజరయ్యింది. ఇప్పడు ఈ విషయం సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ గా మారింది. ఎందుకు అంతలా వైరల్ అవుతుందో అందరకి తెలిసిందే. అదే టైం లో చైతు, శోభిత ల ఎంగేజ్మెంట్ పిక్స్ కూడా వైరల్ గా నిలుస్తున్నాయి.ఇక శోభిత 2013 లో ఫెమినా నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత పలు తెలుగు తమిళ, హిందీ,మలయాళ, ఇంగ్లీష్ సినిమాల్లో నటనకి అవకాశమున్న పాత్రల్ని పోషించి మంచి పేరు సంపాదించింది. అడవి శేషు  హీరోగా వచ్చిన గూఢచారి లో కూడా చేసింది.