తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ఎన్నికైన దిల్ రాజు పదవి కాలం ముగియడంతో నేడు(జూలై 28) అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరిగాయి. ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అధ్యక్ష పదవి కోసం భరత్ భూషణ్, ఠాగూర్ మధు పోటీ పడగా.. భరత్ భూషణ్ విజయం సాధించారు. ప్రొడ్యూసర్స్ , ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ , స్టూడియో సెక్టార్ లోని సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.మొత్తం సభ్యులు 48 మంది సభ్యులు కాగా, ఓటింగ్ లో 46 మంది సభ్యులు పాల్గొన్నారు. భరత్ భూషణ్ కి 29 ఓట్లు, ఠాగూర్ మధుకి 17 ఓట్లు పోల్ అయ్యాయి. ఇక ఉపాధ్యకుడిగా అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీ పడగా.. అశోక్ కుమార్ గెలుపొందారు. అశోక్ కుమార్ కి 28 ఓట్లు, వైవీఎస్ చౌదరి కి 18 ఓట్లు పోల్ అయ్యాయి.
Comments
0 comment