అయోధ్య రామమందిరం లో ప్రతిష్టించ బోయే సీతా రామ లక్ష్మణ మూర్తులు ఇవే ...!
కోట్ల మంది భారతీయుల చిరకాల కోరిక శ్రీ రాముడి మందిర నిర్మాణం అలాంటి మందిర నిర్మాణానికి ఎందరో భారాతీయుల విరాళాలు ,మరెందరో కానుకలు పంపించి స్వామి కార్యం లో భాగం అవుతున్నారు అలాంటి శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామ మందిర ప్రారంభానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22న ఆలయంలో సీతారాముల విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేంద్రం, ఉత్తర ప్రదేశ్‌ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజులపాటు వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గడువు సమీపిస్తుండడంతో మూడు షిఫ్టుల్లో పనులు చేస్తున్నారు. ప్రారంభత్సోవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతోపాటు 4 వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారు. అయోధ్య జిల్లా అధికార యాంత్రంగం దీనిపై రోజూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.
15 నుంచి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు..
జనవరి 15వ తేదీ నుంచే శ్రీరాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా దీనిని నిర్వహించడానికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వేడులకు రావాలని ఆహ్వాన పత్రికలనూ పంపించింది. మరోవైపు అయోధ్యలో ప్రతీ ఇంటికి రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలు అందాయి.
విగ్రహాలు సిద్ధం అయ్యాయి
మరోవైపు రామమందిరంలోప్రతిష్టించే రామ్ లల్లా విగ్రహాల నిర్మాణం పూర్తయింది. శ్రీఆంజనేయ, లక్ష్మణ సమేత సీతారామచంద్రుల వారి విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించనున్నారు. మైసూర్‌కు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ శిల్పాలను చెక్కారు. అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాలనే రామంందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫైనల్ చేసింది. ఆ విగ్రహ ఫొటోలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తమ అధికారిక్ ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కన్నడిగుడు రూపొందించిన విగ్రహాలను అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేయాలనుకోవడం దేశం మొత్తానికే గర్వకారణమని యడ్యూరప్ప పేర్కొన్నారు.
ముగ్గురికి శిల్పాలు చెక్కే బాధ్యత..
రామాలయంలో ప్రతిష్టించే విగ్రహాలను చెక్కే బాధ్యతను అరుణ్‌యోగిరాజ్‌తోపాటు కర్ణాటకకే చెందిన గణేశ్‌భట్, రాజస్థాన్ శిల్పి సత్యనారాయణ్‌పాండేకు అవకాశం కల్పించారు. వారు ముగ్గురూ శిల్పాలను రూపొందించారు. ముగ్గురి విగ్రహాలను తీర్థక్షేత్ర ట్రస్ట్ షార్ట్ లిస్ట్‌లోకి తీసుకుంది. చివరకు అరుణ్ యోగిరాజ్ నిర్మించిన విగ్రహాలను ప్రతిష్టించాలని నిర్ణయించింది. ముంబైకి చెందిన వాసుదేవ్ కామత్ గీసిన చిత్రాల ఆధారంగా యోగిరాజ్ ఈ విగ్రహాలను రూపొందించారు.
Comments
0 comment