కార్తీక సోమవారం శివయ్యని ఇలా పూజిస్తే శివుడు కరుణిస్తాడు

అన్ని మాసాలలోకెల్లా కార్తీక మాసమ్  అతిపవిత్రమైనదిగా పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ మాసంలోని కార్తీక సోమవారం నాడు శివయ్యకు ప్రత్యేక పూజలు చేసి, ఉపవాస దీక్షను ఆచరించి, దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందొచ్చని పండితులు చెబుతారు. ఈ సందర్భంగా కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు.. కార్తీక సోమవారం రోజున పరమ పవిత్రమైన ఈశ్వరుని ఆలయాలను ఎందుకు దర్శించుకోవాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

703-entry-0-1700457782.jpg

కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోళా శంకరుడిని పూజిస్తే దీర్ఘసుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ప్రవహించే నదిలో స్నానం చేసి ‘‘హర హర శంభో.. హర హర మహదేవ’’ అంటూ ఈశ్వరుడిని స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని చాలా మంది విశ్వాసం.

703-entry-0-1700457782.jpg

కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల కైలాస దర్శనభాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో పేర్కొనబడింది. దీన్నే కార్తీక నత్తాలు అని కూడా అంటారు.కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యా వేళలో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి. అనంతరం పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు, ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని చాలా మంది నమ్ముతారు.సాధారణంగానే సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. సోమ అనే పదంలో సోమ అంటే ఉమ అనే అర్థం వస్తుంది. అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెబుతారు. ఈ కారణంగా సోమవారం రోజున శివునికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు బిల్వ పత్రాలతో పూజించాలి. మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకుని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి కార్తీక దీపం వెలిగించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. కార్తీక సోమవారమంతా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలొస్తాయి.