కోనసీమ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం

855-entry-0-1701781575.jpg

వాడపల్లి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువుతీరిన అద్భుతమైన  పుణ్య క్షేత్రం,సాక్షాత్తు నారదమహాముని స్వామివారికి  వేం అనగా పాపం కట  అంటే తొలగించేవాడు అని అర్ధం కనుక వెంకటేశ్వరునిగా నామకరణం చేసి ప్రతిష్టించిన పుణ్య క్షేత్రం ,ఈ క్షేత్రం లో భక్తులు చేసే 7 శనివారాల వ్రత మహత్యం గురించి తెలుసుకోవాలిసిందే,అందులోను ఈ ఏడుశనివారాలు చేసిన తరువాత  స్వామివారు కరుణ పొందినవారు ఎందరో ..... ఆంధ్ర రాష్ట్రం లోనే కాక దేశ  విదేశాలలో వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న  భక్తులు కో...  కొల్లల్లు అంటే అతిశయోక్తి కాదు, ఈ ఏడుశనివారాలు చేసి స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే వుంది అంటే స్వామివారి మహత్యం వర్ణించనలనది కాదు.

ముందుగా ఆయా ప్రాంతాలనుండి వాడపల్లి చేరుకున్న భక్తులు, దేవాలయం వారు ఏర్పాటు చేసిన వాహన పార్కింగులలో వారి వాహనాలను నిలిపి,దేవాలయనికి  చేరుకుంటారు,చేరుకున్న తరువాత మనఃసంకల్పం తో ,స్వామివారి నామాన్ని మనస్సులో స్మరిస్తూ ....మొదటి సారిగా  స్వామివారి మాడవీధులలో ఏడూ ప్రదిక్షణాలు చేస్తారు ,ఇలా ప్రదిక్షణాలు పూర్తిచేసుకున్నతరువాత స్వామి వారిని వాడపల్లి వాసా వెంకటేశా గోవిందా గోవిందా అంటూ భక్తి ప్రపత్తులతో స్వామి వారిని దర్శించుకుంటారు ,ఇలా ఏడూ శనివారములు చేసి ఏడవవారం వసంత మండపము నందు అష్టోత్తర పూజాధీ  కార్యక్రమములు నిర్వహించి స్వామివారిని ధరించుకుంటారు, ,అనంతరం ఇక్కడ జరిగే నిత్యాన్నదానం కార్యక్రమంలో అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇక్కడ ప్రతి నిత్యం జరిగే శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మి హోమం నయనానందకరం

ముందుగా ఇక్కడ స్వామివారి స్థలపురాణం విషయానికి వస్తే ఒకానొక సందర్భములో నారద ,గౌతమ ,కశ్యప,అత్రి మొదలగు మహర్షులందరు విష్ణు లోకం చేరుకుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు ని ప్రార్ధించి ,స్వామి కలియుగం లో మానవులందరు ఈతి బాధలతోను ,కష్టాలతోను బాధపడుతూ వున్నారు వారికి సరియైన మార్గాన్ని నిర్ధేసించి వారిని కరుణించమని వేడుకోగా ,అప్పుడు శ్రీ మహా విస్థునువు నేను గౌతమీ నది తీరం లో నౌకాపురమునందు ఆచ్ఛావతారామ్ గా వెలుస్తాను అని  ఇదే విషయాన్ని పుర జనులకు తెలుప మనగా ... నారద మహర్షి నౌకాపురము వచ్చి ,అక్కడ పుర జనులకు విషయాన్ని వివరించారట  ... ఇలా కొంత కలం గడిచిన తరువాత స్వామి వారు ఒక బ్రాహ్మణుని కలలో కనిపించి నేను నౌకాపురము చేరుకున్నాను అని ,పురజనులందరు సుచి శుభ్రతతో నన్ను వెతికితే నేను కనిపిస్తాను అని చెప్పగా ,స్వామి కలలోకి వచ్చారు అన్న సంతోషం తో జనులందరు గౌతమీ నదిలో వెతుకగా ఎక్కడా స్వామివారు కనిపించకుండెను ,అప్పుడు పురజనులందరు స్వామి మేము చేసిన తప్పులు క్షమించి మాకు దర్శనము ఇవ్వమని అడుగగా ,అప్పుడు స్వామి మీరు సుచి శుభ్రతతో నన్ను వెతకలేదు ,అందుకే మీరు నన్ను కనుగొనలేక పోయారు అని చెప్పి ,మీరు సూచి శుభ్రతతో వెళ్లి ఎక్కడైతే గరుడ పక్షి వాలి ఉంటుందో అక్కడే నేను ఉన్నట్టు ,అని చెప్పగా పురజనులందరు శుచిశుభ్రతతో  మేళ తలాతో గౌతమీ నదిని చేరుకుంటారు ,ఎక్కడ గరుడ పక్షి వాలిందో అక్కడ వెతకగా ఒక చందనాపేటిక కనబడుతుంది ,దానిని నిస్ట్నాథుడు అయినా కమ్మరితో  దానిని తెరిపించగా అందులో లక్ష్మి సమేతుడైన సాక్షాత్తు శ్రీ  వెంకటేశ్వర స్వామి దర్సనం ఇస్తారు  ,అప్పుడు నారద మహర్షి స్వామి వారికి వెంకటేస్వరుని గా నామకరణము చేసి గౌతమీ నది చెంత స్వామివారిగి మండప ప్రాకారాలతో  గుడి కట్టించెను అని పురాణగాథ

ఇప్పుడున్న వాడపల్లి ఒకప్పుడు నౌకాపురముగా పిలిచేవారు ,ఇక్కడ గౌతమీ నదీ తీరం లో నౌకలమీద వర్తక వ్యాపారాలు  నిర్వహిస్తూ ఉండేవారు అందులో భాగంగా పెనుబోతుల గజేంద్రులు వారు కూడా ఇక్కడే వాణిజ్య వర్తక వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండేవారు ,ఒకానొక సమయం లో గాలి వానలలో గజేంద్రుడి నౌకలాన్ని కొట్టుకుపోయాయి ,అప్పుడు పెనుబోతుల గజేంద్రుడు  స్వామివారిని తలచుకుని స్వామి నా నౌకలన్ని నాకు దక్కే టట్టు చేయమని కోరాగా ,అపుడు స్వామి వారు నౌకలాన్ని ఒడ్డుకు చేర్చగా ...ఎంతో ఆనందభరితుడైన గజేంద్రుడు గౌతమీ తీరం లో శిధిలావస్థలో వున్నా గుడిలో స్వామివారిని   ,ప్రస్తుతం వున్నా వాడపల్లిలో  గుడిని నిర్మించి అందులో పునః ప్రతిష్టించినట్టు  చరిత్ర చెబుతుందిఇక్కడ స్వామి వారి నిత్యాన్నదానం ఎంతో అద్భుతంగా  జరుగుతుంది ,ప్రతినిత్యం వేలాది మందికి నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ,వచ్చిన భక్తులతో ఇక్కడ సిబ్బంది ఎంతో గౌరవమర్యాదలతో వడ్డించడం నిర్విరామంగా ఇక్కడ దేవాలయం లో  అన్నదాన కార్యక్రమం కొనసాగించడం మాటలలో చెప్పలేనిది