మనిషి చనిపోయాక ఆత్మ పరిస్థితి ఏంటి ? ఎం జరుగుతుంది ?
మనిషికి పుట్టుక ఎలాగైతే ఉంటుందో మరణం కూడా అలాగే ఉంటుంది. గొప్ప యోగులు, స్వామీజీలు సైతం మరణానికి తల వంచక తప్పదు. మరణం వరకు అందరికీ తెలుసుకానీ మరణం తరువాత జరిగే పరిస్థితులు చాలామందికి తెలియవు. ముఖ్యంగా మరణం తరువాత ఆత్మ పరిస్థితి ఏంటో దాని స్వభావం ఏమిటో అస్సలు తెలియవు. మరణం గురించి, మరణం తరువాత ఆత్మ గురించి గరుడ పురాణం ఏం చెప్పిందో తెలుసుకుంచే..గరుడ పురాణంలో మొత్తం 84 జాతుల గురించి ప్రస్తావన ఉంది. వీటిలో చెట్లు, పక్షులు, జంతువులు, కీటకాలు, మనుషుల గురించి కూడా పేర్కొనబడింది. మరణించిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టినా ఆత్మకు ఆకలి, దాహం, కోపం, ద్వేషం, కామం వంటి భావాలు పోగొట్టుకోదట. మనుషులు చేసిన మంచి చెడుల ఆధారంగా ఆత్మ యమలోకానికి వెళుతుందని అక్కడ పాపాలకు ఫలితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని గరుడ పురాణం పేర్కొంది. అదే విధంగా జీవితంలో చేసిన మంచి, చెడు పనుల ఆధారంగా ఆత్మ తరువాత జన్మను ఎప్పుడు తీసుకోవాలనే విషయం నిర్ణయించబడుతుందట.మరణం తరువాత ఆత్మ తరువాత జన్మను ఎలా ఎవరిగా పుడుతుందో అది ఆ వ్యక్తి పనుల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అదే సమయంలో చెడు పనులు చేసే వ్యక్తుల ఆత్మలు మృత్యులోకంలో తిరుగుతూనే ఉంటాయట. మరొక వైపు ఎవరైనా సహజమార్గంలో చనిపోకపోతే అంటే ప్రమాదాలు, హత్యలు, లేదా ఆత్మహత్య మొదలైన వాటివల్ల ఆత్మ దయ్యం రూపంలోకి మార్పు చెందుతుందట.
Comments
0 comment