సిల్కు ద్వాదశి రోజున తులసి కళ్యాణం ఇలా చేయండి లక్ష్మి కటాక్షం కలుగుతుంది
ఇంటిలో కష్టాలు లేకుండా ఆనందం తో ... కుటుంభం అంత ఉండాలి అంటే తులసిని ప్రతినిత్యం పూజించినా తులసి వివాహం జరిపించినా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ముఖ్యంగా తులసి వివాహం జరిపించడం వల్ల కన్యాదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మోక్షం ప్రాప్తిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే తులసి వివాహం ఎప్పుడు చేయాలి? దీనికి సరైన సమయం ఏది? తులసి వివాహం వల్ల కలిగే ఫలితాలేంటి?
కార్తీకమాస శుక్లపక్షంలో నవంబర్ 22వ తేగీన ఏకాదశి ఉంది. ఈ తిథి రాత్రి 11.03 నుండి ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 9.01 వరకు ఉంటుంది.23వ తేదీ సాయంత్రం 5.25 నుండి రాత్రి 8.46 మద్యన తులసి పూజకు మంచి సమయం. ఈ సమయంలో తులసి వివాహం జరుపవచ్చు. నిజానికి తులసి వివాహం సాయంత్రం సమయంలో జరుపుతారు. ఏకాదశి 22వ తేదీ రాత్రి ప్రారంభమైంది కాబ్టటి 23వ తేదీ సాయంత్రం తులసి వివాహం జరుపుకోవచ్చు.
తులసి వివాహం వెనుక కారణం..
కార్తీక మాసంలో ఏకాదశి రోజున విష్టుభగవానుడు యోగనిద్రనుండి మేల్కొంటాడు. ఆ మరుసటి రోజే అంటే ద్వాదశి రోజు సాలగ్రామ అవతారంలో తులసి వివాహం చేసుకుంటాడు. అప్పటి నుండి సాలగ్రామ రూపంలో ఉన్న విష్టుమూర్తికి తులసికి వివాహం జరపడం ఆనవాయితీగా వస్తోంది.
తులసి వివాహం ఎలా జరపాలి?
తులసి వివాహం జరపడానికి ఏకాదశి తిథిరోజు అన్ని పండుగల మాదిరిగానే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. రోజంతా శుచిగా ఉండాలి. సాయంత్రం సమయంలో మాత్రమే తులసి వివాహం జరుపుతారు కాబ్టటి అందుకోసం కావలసిన సామాగ్రి సిద్దం చేసుకోవాలి.తులసి వివాహాన్ని విష్ణువుకు మరో రూపం అయిన శాలిగ్రామంతో జరుపుతారు. ఇందుకోసం విష్ణువు శాలిగ్రామాన్ని తులసి చెట్టుకు కట్టాలి. తరువాత గంగాజలం చల్లాలి. తులసి చెట్టు ముందు నీటితో నింపిన పాత్ర ఉంచి అందులో నెయ్యి దీపం వెలిగించాలి.
తులసి మొక్క ఏర్పాటు చేసిన కుండీలో చెరకు మండపాన్ని ఏర్పాటు చేయాలి. తులసి, శాలిగ్రామాలకు చందనాన్ని రాసి తిలకం దిద్దాలి. తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించాలి. తులసమ్మకు ఎరుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. చేతికి కంకణం కట్టుకోవాలికంకణం కట్టుకున్న చేతిలో శాలిగ్రామాన్ని పట్టుకుని తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తరువాత కర్పూర హారతి ఇవ్వాలి. తులసి వివాహం జరిపేవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండి తీరాలి. పూజ తరువాత మాత్రమే ప్రసాదం స్వీకరించాలి.
Comments
0 comment