వాడపల్లి వచ్చే భక్తులకు ముఖ్యగమనిక

కోస్తా తీరాన్ని వణికించిన మిచౌంగ్ తుఫాన్ ఈ నెల 5న బాపట్ల పరిసరాల్లో తీరందాటిన సంగతి తెలిసిందే. ఈ తీవ్ర తుఫాన్‌ ఉత్తరంగా కోస్తా, తెలంగాణ మీదుగా పయనించే క్రమంలో బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది గురువారం సాయంత్రానికి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌.. దానికి ఆనుకుని విదర్భ పరిసరాల్లో ఉంది. సాధారణంగా తుఫాన్‌ తీరం దాటిన మూడు రోజుల వరకూ దాని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది,అయితే ఈ తుఫాన్ కోనసీమ జిల్లాని అతలాకుతలం చేసింది ,పంటపొలాలు నీటమునిగిపోయాయి రోడ్లు పాడయిపోయాయి ,ఎన్నో ఇల్లు నేలమట్టం అయ్యాయి ,అలాగే కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ఏర్పాటు చేసిన వాహన పార్కింగ్ ప్రదేశం నీటమునిగిపోయింది ,దాని ఫలితంగా భక్తుల వాహనాలు నిలుపుదల చేసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది  అని భక్తులు సహకరించాలి అని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు,దేవాలయానికి దగ్గరలో వుండే ఈ పార్కింగ్ లో నిలిచిపోయిన నీటిని తొలగించే ఏర్పాట్లు చేస్తున్నామని ,అయినా అదంతా బురద గా ఉండటం వలన వాహనాలు నిలుపుదల సాధ్యం కాదు అని అభిప్రాయం పడ్డారు, కావున భక్తులందరూ సహకరించాలి అని దేవాలయ సిబ్బంది కోరుతున్నారు 

భక్తులకు మనవి...🙏