ఆందోళన కారణం ఏమిటి ? ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?
ఇప్పడు వున్నా రోజుల్లో మానసిక సమస్యలు ,ఆహరం ,పరిసరాలు మన జీవితాలని ప్రభావితం చేస్తున్నాయి ,ఇప్పుడున్న పని ఒత్తిడి లో ఆందోళన మానసికంగా దెబ్బతీయటమే కాదు. రకరకాల జబ్బులనూ మోసుకొస్తుంది. కాబట్టి దీని లక్షణాలను గుర్తించి త్వరగా చికిత్స తీసుకోవటం మంచిది. ఆహారంతోనూ దీనికి కళ్లెం వేయొచ్చు.
* మెగ్నీషియం తక్కువగా గల ఆహారంతో ఆందోళన సంబంధ ప్రవర్తన పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మెగ్నీషియంతో కూడిన పాలకూర, పప్పులు, గింజ పప్పులు, విత్తనాలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తినాలి.
* జీడిపప్పు, కాలేయం, గుడ్డు పచ్చసొన వంటి వాటిల్లోని జింక్ కూడా ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది.
* ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గల చేపలు సైతం ఆందోళన తగ్గిస్తాయి.
* పెరుగు వంటి ప్రొబయోటిక్ పదార్థాలు నలుగురిలోకి వెళ్లినపుడు తలెత్తే ఆందోళన లక్షణాలను తగ్గిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
* ఆకుకూరలు, పొట్టుతీయని ధాన్యాలు, పచ్చబఠానీలు, వేరుశనగలు, బాదంపప్పు, చికెన్ వంటి వాటిల్లోని బి విటమిన్లు మానసికోల్లాసాన్ని కలిగించే సెరటోనిన్, డొపమైన్ల ఉత్పత్తిని పెంచుతాయి.
Comments
0 comment