చలికాలం లో బీపీ అందుకే పెరుగుతుంది
చలికాలంలో బీపీ పెరగటానికి కొన్ని కారణాలు చూపిస్తున్నారు ఆరోగ్యనిపుణులు ,ముఖ్యంగా రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే బయపడుతారు. కానీ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో వండే పదార్థాల కంటే బయట కనిపించే ఆహార పదార్థాలు రుచిగా అనిపిస్తాయి. ఈ నేపథ్యంలో వేడిగా ఉండే ఆయిల్ పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది. కొందరు భోజన ప్రియులు సాధారణ కాలాల కంటే చలికాలంలో కాస్త ఎక్కువ లాగించడానికి ట్రై చేస్తారు. అంతేకాకుండా వేడి వేడిగా ఉండే పదార్థాలు ఎంత తింటున్నామో తెలియకుడానే పొట్టలోకి వెళ్తుంది.
వేసవి కాలంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దీంతో చెమట ద్వారా శరీరం అలసిపోయి తిన్న ఆహారం వెంటనే జీర్ణం అవుతుంది. కానీ శీతాకాలంలో మాత్రం చెమట తక్కువగా ఉంటుంది. దీంతో ఆహరం త్వరగా జీర్ణం కాదు. ఈ నేపథ్యంలో బయట లభించే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తుంటాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. ఇలా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి బీపీ పెరిగే అవకాశం ఉంది.
శీతాకాలంలో ఉదయం బయట అడుగుపెట్టాలంటే చాలా మంది ఇష్టం ఉండదు. దీంతో వ్యాయామం చేయడం మానేస్తారు. దీంతో శరీరం కదలిక లేక ఒత్తిడి పెరిగి క్రమంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అయితే ఈ బీపీ కంట్రోల్ కావాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. బయట తిళ్ల తక్కువ చేసి ఇంట్లోనే వండుకొని తినాలి. ఇక ఈ సమయంలో దాహం వేయదు. దీంతో నీరు తక్కువగా తాగుతూ ఉంటారు. ఫలితంగా బాడీ డీ హైడ్రేషన్ కు గురవుతుంది. అందువల్ల దాహం లేకపోయినా నీరు తాగుతూ ఉండాలి. అప్పుడే శరీరంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
Comments
0 comment