ఈ కాలం లో బరువు ఈజీగా తగ్గిపోండి
ఈ రోజుల్లో చాలామంది సమస్య అధిక బరువు ,శీతాకాలంలో జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. అయితే ఈ కాలంలో చాలా మంది బరువు కూడా పెరుగుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకు ఈ కాలంలో బరువు పెరగడానికి అసలు కారణాలు ఏంటి? అది తెలుసుకుంటే మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు.
చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. దీంతో ఫిట్నెస్ రొటిన్ అదుపు తప్పి...శరీరంలో క్యాలరీలు కొవ్వుగా మారుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. అయితే దీన్ని అధిగమించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదాస స్నేహితుడిని ఫిట్నెస్ పార్టనర్ గా సెలక్ట్ చేసుకుని ఒకరికొకరు ప్రోత్సహించకుంటూ వ్యాయామం చేయండి. ఇదొక్కటే కాదు ఈ కాలంలో బరువు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం.
ఎండ శరీరానికి తగలకపోయినా:
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఎండలో నిల్చుంటాం. ఈ క్రమంలో ఎండలో వ్యాయామాలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ కాలంలో కొన్ని రోజులు పొగమంచు కారణంగా ఎండ ఉండదు. ఇలా చలికాలంలో శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రకమైన డిప్రెషన్ వంటిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆహారపు అలవాట్లు, మోతాదుకు మించి ఆహారం తినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాట్లు అంతిమంగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి కాబట్టి ఉదయం ఎండ లేకపోతే మధ్యాహ్నం పూట కాసేపు వీలు కుదుర్చుకుని ఎండలో ఉండటం మంచిది. అయితే ఈ క్రమంలో సూర్యకిరణాల కారణంగా చర్మ సమస్యలు తలెత్తకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
అర్థరాత్రి ఆకలేస్తుంది?
శీతాకాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో డిన్నర్ తొందరగా చేయడం, రాత్రి ఎక్కువ సేపు మెలకువ ఉండటం, రాత్రుళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవడం..ఇలా కారణాలతో అర్థరాత్రి ఆకలేస్తుంది. అలాంటప్పుడు చాలామంది బిస్కెట్లు, చిప్స్, పాప్ కార్న్, కుకీస్, చాక్లెట్స్ తింటుంటారు. ఈ అలవాటును కొనసాగి్స్తే బరువు పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. వీటికి బదులుగా పండు, పండ్ల రసాలు, నట్స్ , డ్రైఫ్రూట్స్ తినడం మంచిదని చెబుతున్నారు.
Comments
0 comment