ఉమ్మనీరు లేక గర్భస్రావాలు ..ఇలా చేస్తే ఉమ్మనీరు పెరుగుతుంది

ఈమధ్య కాలం లో ఉమ్మనీరు లేక ఎన్నో గర్భ స్రావాలు జరుగుతున్నాయి అని మనము చాల చోట్ల వింటున్నాము ,కడుపులో బిడ్డ సౌకర్యంగా సాగడానికి ఉమ్మనీరు చాలా అవసరం. ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ఒత్తిడి, దెబ్బతగిలినా ఏం కాకుండా కాపాడుతుంది. గర్భసంచిలో బెలూన్‌ ఉండటంతో బయటి నుంచి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటుంది. అమ్మ గర్భంలో బిడ్డకు రక్షణ కవచంగా ఉండే ఉమ్మనీరు తగినంత లేకపోయినా.. ఎక్కువయినా కడుపులోని బిడ్డకు సమస్యలు మొదలవుతాయి. నెలలు నిండుతున్న కొద్దీ చాలా మందిలో ఉమ్మనీరు తగ్గడం చూస్తుంటాం. ఉమ్మనీరు నీరులో హెచ్చుతగ్గులు ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఉమ్మనీరు పెంచే ఆహార పదార్థాల గురించి ఈ స్టోరీలో చూద్దాం.ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే అమ్మకు ఆయాసం అధికంగా ఉంటుంది. ఏడో నెల తర్వాతయితే మరింత ఇబ్బంది పెడుతుంది. క్రమంగా ఉమ్మనీరు పెరిగితే.. గాలి ఎక్కువయితే బెలూన్‌ ఎలా పగులుతుందో ఇదీ అలాగే పగిలిపోతుంది. దీనితో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. నొప్పులు తొందరగా వస్తాయి. నిర్ణీత కాలం కంటే ముందుగానే ప్రసవం అయిపోతుంది. ఒక్కోసారి చిన్నారి మరణించే ముప్పు ఉంది.ఉమ్మనీరు తక్కువైతే.. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, చిన్నారి తక్కువ మూత్రం పోవడంతో ఉమ్మనీరు తగ్గుతుంది. ఇలాంటి వారికి అవసరమైతే తొందరగా ప్రసవం చేయాల్సి రావొచ్చుఉమ్మనీరు స్థాయులు పెరగాలంటే.. సరిపడా నీళ్లు తాగాలి. తాజా పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. వీటితో వేగంగా ఉమ్మనీరు అభివృద్ధి చెందుతుంది.

నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా, పాలకూర, బ్రకొలీ, టొమాటో, క్యాలీఫ్లవర్‌, క్యారెట్‌ వంటివి తినాలి. వీటితో శరీరానికి సరిపడా నీరు సమృద్ధిగా అందుతుంది. పుచ్చకాయ, ద్రాక్ష, దానిమ్మ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లల్లో నీరు అధికంగా ఉంటుంది. ఈ పండ్లు ఎక్కువగా తీసుకోండి.

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోండి. కొబ్బరి నీళ్లలోని పోషకాలు.. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఉమ్మనీరుని వృద్ధి చేయటమే కాకుండా శిశువు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతాయి.