వీటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు మీరు ...?
ఖరీదు ఎక్కువే అయినా వాటిపని తనం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది అందుకే మన తెలుగు వారు వంటల్లో విరివిగా యాలకులు వడుతూవుంటారు ,పోషకాలు సమృద్ధిగా ఉండే యాలకులను ప్రతీరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం మనం వాటి గురించి తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో యాలకులను తీసుకోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరుగుతుంది. లైంగిక సామర్థ్యాన్ని యాలుకలు మెరుగుపరుస్తాయి. అంతేకాదు విపరీతంగా బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి రోజు ఖాళీ కడుపుతో యాలుకలను తీసుకోవడం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. యాలకులలో ఉండే పోషకాలు బరువును తగ్గించడంలో గణనీయంగా పని చేస్తాయి .యాలకులలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల అనియంత్రిత పెరుగుదలను నిరోధిస్తాయి. క్యాన్సర్ బారి నుండి రక్షణ కల్పిస్తాయి.
యాలుకలు తీసుకోవడం వల్ల స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే వీరిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. యాలుకలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు మరియు దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం యాలకులలో లభించే పోషకాలు దగ్గు సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.
చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు యాలుకలను నిత్యం ఖాళీ కడుపుతో తీసుకుంటే, ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న ఆహారం జీర్ణం కాక ప్రతిరోజు ఇబ్బంది పడేవారు, ఎసిడిటీతో బాధపడేవారు యాలుకలను ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
Comments
0 comment