బొత్సా కి చరమ గీతం పాడిన వైసీపీ ..?

ఎదో సినిమాలో చెప్పినట్టు ,పార్టీలు మారింధా సులువు కాదురా ,పెళ్లిళ్లు మార్చడం అన్నట్టు ,మన విద్యాసాకా మాత్యులు పార్టీలు కూడా అలానే మారుస్తూ వచ్చారు ,ఇప్పుడు బొత్సా అనారోగ్యం కారణంగా  కనీసం రెండు నెలల పాటు ఆయనకి విశ్రాంతి అవసరం ఉంటుంది. మరోవైపు చూస్తే ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన బరిలో దిగుతారా? లేదా? అన్న చర్చ ప్రారంభమైంది. తాజాగా ఆయన భార్యతో పాటు కుమారుడు పేరు బలంగా వినిపిస్తోంది. ఒకరు ఎంపీగా, మరొకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ హై కమాండ్ నుంచి భిన్న సంకేతాలు వస్తున్నట్లు తెలుస్తోంది.బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ రాణి రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. ఆమె ఈసారి విజయనగరం పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయనకు అసెంబ్లీకి పంపించి.. ఎంపీ సీటును బొత్స కుటుంబీకులకు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. అయితే బెల్లాన చంద్రశేఖర్ ను ఎక్కడ సర్దుబాటు చేస్తారన్నది అంతు చిక్కని ప్రశ్న. ఆయన చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నారు. అది బొత్స సత్యనారాయణ సిట్టింగ్ స్థానం. అది వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇక బెల్లానకు రెండో ఆప్షన్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం. కానీ అక్కడికి వెళ్లేందుకు బెల్లాన చంద్రశేఖర్ ససే మీరా అంటున్నట్లు తెలుస్తోంది.

 

మరోవైపు బొత్స కుమారుడు డాక్టర్ సందీప్ ఎమ్మెల్యేగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. చీపురుపల్లి నుంచి తన కుమారుడికి, విజయనగరం ఎంపీ స్థానం నుంచి తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని బొత్స సత్యనారాయణ కోరుతున్నట్లు తెలుస్తోంది. అలా అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లో వైసీపీకి గెలిపించుకుని వస్తానని… పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని మెలిక పెట్టినట్లు సమాచారం. అయితే హై కమాండ్ మాత్రం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఒక్కటే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బొత్స సోదరుడు అప్పల నరసయ్య గజపతినగరం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సమీప బంధువు బొడ్డుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఇన్ని పదవులు ఉండగా మరో పదవి ఇవ్వడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే తాజాగా బొత్స అనారోగ్యానికి గురికావడంతో.. జిల్లాలో పార్టీ పగ్గాలు చూస్తున్న ఆయన మేనల్లుడు శ్రీనివాసరావుకు హై కమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన సైతం వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగానో.. ఎంపీ గానో పోటీ చేయాలని చూస్తున్నారు. అటు బొత్స కుటుంబంలో సైతం కొన్ని రకాలుగా అరమరికలు వచ్చాయని టాక్ నడుస్తోంది. చాలా రకాల విభేదాలు చుట్టుముట్టాయని.. ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు సైతం ప్రచారం జరిగింది. ఈ పరిణామాలను ఆసక్తిగా చూస్తున్న వైసీపీ హై కమాండ్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బొత్స దూకుడుకు కళ్లెం వేయడానికి.. ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.ఇలా అయితే ఎన్నికల ముంగిట ఏ పరిణామాలు జరుగుతాయో చూడాలి.