దెబ్బకు దెబ్బ ...?
వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీం ప్లేయర్లందరు వరుసగా ఫెయిల్ అవ్వడంతో సౌతాఫ్రికా టీమ్ 212 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అందులో మిల్లర్ ఒక్కడే సెంచరీ చేసి 101 పరుగులు చేశాడు. ఇక 213 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియన్ టీం కి ప్లేయర్లలో వాళ్ల ఓపెనర్లు కొంతవరకు బాగానే ఆడినప్పటికీ మిడిలాడర్ మొత్తం ఫెయిల్ అయింది. ఇంక దాంతో చివరకు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఇద్దరూ కలిసి మ్యాచ్ కి మంచి విజయాన్ని అందించారు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ ఫైనల్ కి చేరుకుందిఇక ఇప్పటికే ఇండియన్ టీం ఫైనల్ కి చేరుకోగా ఇప్పుడు ఆస్ట్రేలియా టీం కూడా ఫైనల్ కి చేరుకుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య తుది సమరం నవంబర్ 19వ తేదీన జరగనుంది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2003 లో జరిగిన వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియన్ టీం ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది. ఇక ఇప్పుడు ఆ రివెంజ్ ని తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం ఇండియన్ టీం అత్యంత భయంకరమైన టీముగా పేరు తెచ్చుకుంది. ఇండియన్ టీం ప్లేయర్లను చూస్తున్న ప్రతి ఒక్క ప్రత్యర్థి ప్లేయర్ కూడా భయంతో వణికిపోతున్నాడు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఇక ఇలాంటి టైంలో ఇండియా ని ఓడించడం ఆస్ట్రేలియా వల్ల కాదు కానీ ఇండియన్ టీం ఆస్ట్రేలియా ని ఓడించి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది.ఇక ఇప్పటికే ఇండియా ఆస్ట్రేలియా ని లీగ్ దశలో చిత్తు గా ఓడించింది. అయితే ఇండియా సెమీఫైనల్ లో 2019 నాటి రివేంజ్ ను న్యూజిలాండ్ మీద ఎలాగైతే తీర్చుకుందొ, ఇక ఇప్పుడు కూడా 20 సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా కి బాకీ పడిపోయిన రివెంజ్ ని మళ్లీ గుర్తు చేసుకొని తీర్చుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక అందులో భాగంగానే మన ఆస్ట్రేలియన్ టీమ్ ఫైనల్ కి చేరుకున్నందుకు వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూనే ఇండియన్ టీమ్ వాళ్ళకి భారీ పోటీ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ భారీ వ్యూహాలతో బరిలోకి దిగపోతున్నట్టుగా తెలుస్తుంది.
న్యూజిలాండ్ మ్యాచ్ లో ఇండియన్ టీం ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసిందో ఇప్పుడు వాటిని సరిదిద్దుకొని ఫామ్ లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఏ చిన్న పొరపాటు లేకుండా ఆడటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఈసారి కప్పు కొడితే ఇండియన్ టీమ్ మూడోవ సారి వరల్డ్ కప్పు కొట్టిన టీమ్ గా చరిత్రలో నిలుస్తుంది…అలాగే పెద్ద టీమ్ అని చెప్పుకునే ఆస్ట్రేలియా లాంటి టీమ్ కు ఓటమి పరాభవాన్ని చూపించినట్టు అవుతుంది.అలాగే మన పాత రివెంజ్ కూడా తీర్చుకున్నట్టు అవుతుంది. ఒక్క దెబ్బకి లెక్కలు మొత్తం సెటిలైపోతాయి అందుకే ఇండియన్ టీం కి ఆడబోయే ఫైనల్ మ్యాచ్ చాలా కీలకంగా మారుతుంది…
Comments
0 comment