పార్లమెంటు లో కలకలం ..? ఎక్కడిదీ ధైర్యం ?

రాజధాని ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే లోక్ సభ లో బుధవారం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇద్దరు ఆగంతకులు సభలోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన వారిద్దరూ టియర్ గ్యాస్ ప్రయోగించారు. వారు వేసుకున్న బూట్ల నుంచి పసుపు రంగు గ్యాస్ వెలువడింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటన జీరో అవర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన నేపథ్యంలో లోక్ సభ లో ఉన్న ఎంపీలు బయటికి పరుగులు తీశారు. అనూహ్య పరిణామం చోటు చేసుకోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. ఈ ఘటనతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని నీలం, అమోల్ షిండే గా గుర్తించారు. కాగా పార్లమెంట్ భవనం పై ఉగ్ర దాడి జరిగి నేటికీ 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. సరిగ్గా సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించడం భయాందోళనలను రేకెత్తిస్తోంది.ఇటీవల ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్నూన్ దేశంలో జరిగే ఎలాంటి పరిణామాలు కైనా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈనెల 13 లోగా పార్లమెంటుపై దాడి చేస్తామంటూ ఆరవ తేదీన హెచ్చరించారు.

909-entry-0-1702483600.jpg

ఈ మేరకు ఒక వీడియో సందేశాన్ని కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు..ఢిల్లీ బనేగా ఖలిస్థాన్ అనే శీర్షికతో ఆ వీడియోను విడుదల చేశారు. ఈనెల 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తామని బెదిరించారు. 2001 పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్ ను కూడా ఆ వీడియోలో ప్రదర్శించారు. కాదు తనను చంపేందుకు భారత ఏజెన్సీలు రూపొందించిన కుట్ర కూడా విఫలమైందని పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 13వ తేదీకి పార్లమెంటు భవనంపై ఉగ్రవాదులు దాడి జరిపి 22 ఏళ్లు పూర్తవుతున్నాయి. 2001 డిసెంబర్ 13వ తేదీన పార్లమెంట్ భవనం పై ఉగ్రదాడి జరిగింది.పన్నూన్ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇది ఉగ్ర కుట్రలో భాగమని అధికారులు చెబుతున్నారు. ఈ అనుహ్యపరిణామంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంట్ లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆగంతకులు ఇంకా ఎవరైనా నక్కి ఉన్నారేమోనని సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఎంపి రఘురామరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరానామం దేశ అంతర్గత భద్రతకు మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. లోక్ సభ ఘటనపై సమాజ్ వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ స్పందించారు. ఇది పార్లమెంట్లో భద్రత ఉల్లంఘన జరిగింది అనడానికి నిదర్శనం అన్నారు. లోక్ సభ లోకి కి వచ్చే సందర్శకులు లేదా రిపోర్టర్లు ఐడి కార్డులు కలిగి ఉండరని.. అలాంటి వారిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఇది పూర్తిగా భద్రతా లోపం అని ఆమె పేర్కొన్నారు. లోక్ సభ లోపల ఏదైనా జరిగి ఉండవచ్చు అని అర్థం వచ్చేలా ఆమె ట్వీట్ చేశారు.