పెరిగిన మద్యం రేట్లు ..!
,మల్లి అధికారం దక్కించుకోలేము అని వైసీపీ భయపడుతున్నట్టు తెలుస్తుంది ,ఇప్పటికే కొన్ని కొన్ని తప్పటడుగులు వేసేసారు మల్లి ఇప్పుడు జగన్ సర్కార్ మద్యం ధరలను పెంచింది. పన్నుల సవరణ పేరిట ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్డ్ కాంపోనెంట్ రూపంలో ప్రస్తుతం విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని… ఆయా బ్రాండ్ల తెరపై శాతాల రూపంలో వసూలు ఉంటుంది. వ్యాట్, ఏఈడీని సవరించింది. ఈ సవరణల వల్ల అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ఒకే తరహాలో పన్నుల భారం పడనుంది. దీంతో అన్ని రకాల మద్యం బ్రాండ్లపై ధరలు పెరగనున్నాయి.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడుపుతోంది. టిడిపి ప్రభుత్వ హయాంలో కంటే మద్యం ధరలను అమాంతం పెంచేసింది. అటు మేలైన బ్రాండ్ లేవీ కనిపించడం లేదు. గతంలో ఎప్పుడూ వినని, చూడని మద్యం బ్రాండ్లే కనిపిస్తున్నాయి. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతుండగా.. అవేవీ పట్టించుకోని ప్రభుత్వం పన్నుల సవరణ పేరిట మద్యం ధరలను తాజాగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. తాజా నిర్ణయంతో క్వార్టర్ మద్యం సీసాపై రూ.10-40 వరకు, హాఫ్ బాటిల్ పై రూ.10-50, ఫుల్ బాటిల్ పై రూ.10-90 వరకు ధర పెరగనుంది. మరికొన్ని బ్రాండ్ల ధరలు తగ్గగా… ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ల ధరలు పెరిగాయి. గతంలో విక్రయాలు లేని, అందుబాటులో లేని బ్రాండ్ల ధరలు తగ్గడం విశేషం.
ఐఎంఎఫ్ఎల్ కనీస ధర రూ.2500 లోపు ఉంటే దానిపై 250 శాతం, రూ.2500 దాటితే 150 శాతం, బీరుపై 225 శాతం, వైన్ పై 200 శాతం, ఫారిన్ లిక్కర్ పై 75% ఏఆర్ఈటి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఒక బ్రాండ్ ఫుల్ బాటిల్ ధర రూ. 570 ఉంటే.. అది రూ.590కి పెరిగింది. బ్రాండ్ క్వార్టర్ ధర రూ.200 ఉంటే రూ.210 కి చేరింది. ఎన్నికల ముంగిట మద్యం ధరల పెంపు ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే మద్యం విధానంలో వైసీపీ సర్కార్ ఫెయిల్ అయిందన్న విమర్శలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పన్నుల సవరణ పేరిట ధరల పెంపు ఇబ్బందికరమే. అయితే ఫారిన్ లిక్కర్ సరఫరాదారులకు ఇచ్చే ధరను పెంచడంతోనే.. మద్యం ధరల పెంపు అనివార్యంగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.
Comments
0 comment