వరల్డ్ కప్ చేయి జారడానికి కాణాలు ఇవే ..?

కొన్ని కోట్ల కళ్ళ ఎదురుచూపులు ,ఎన్నో ఆశలు .... అన్ని నీరు కారిపోయాయి ,అసలు ఎందుకు ఇలా జరిగింది వరల్డ్  కప్ 2023 లో భాగంగా ఇండియన్ టీం ఆస్ట్రేలియా టీం తో ఆడిన ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం విజయం సాధించింది. ఇక దాంతో 12 సంవత్సరాల తర్వాత మరోసారి కప్పు గెలుచుకుంటాం అనే నమ్మకం తో బరిలోకి దిగిన ఇండియన్ టీం కి ఎదురుదెబ్బ తగిలింది.ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకొని ఇండియాని బ్యాటింగ్ కి ఆహ్వానించడంతో ఇండియన్ ప్లేయర్లలో రోహిత్ శర్మ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం బ్యాట్స్ మెన్స్ అందరూ వరుసగా ఫెయిల్ అయ్యారు. కోహ్లీ, రాహుల్ కొద్ది వరకు పర్లేదు అనేలా ఆడినప్పటికీ వాళ్ళు కూడా పూర్తి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయారు.వరల్డ్ కప్ ఫైనల్ కి ముందు ఎంతో స్ట్రాంగ్ గా కనిపించిన ఇండియన్ టీం ఫైనల్ లో ఇలా చేతులెత్తేయడం మాత్రం ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకి గురిచేసింది. మన స్టేడియంలో మన క్రౌడ్ మధ్యలో మన ఇండియాలో మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఇండియన్ టీం ఇలా చేయడం అనేది ప్రతి ఒక్క అభిమానే కాదు ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాలు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఆస్ట్రేలియన్ టీం ని చిత్తుగా ఓడించి 2003 నాటి రివేంజ్ ని తీర్చుకొని ఈసారి ఇండియాకి మూడవసారి వరల్డ్ కప్ ని అందిస్తారు అనే కాన్ఫిడెంట్ తో ఉన్న ప్రతి ఒక్క అభిమానికి ఈ మ్యాచ్ చూసిన సందర్భంలో ఏడుపు ఒకటే తక్కువ అనే రేంజ్ లో ప్రతి ఒక్కరు బాధపడ్డారు…

ఇక ఇండియా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ లో మన బ్యాట్స్ మెన్స్ అందరూ ఫెయిల్ అవ్వడం… ఇక అలాగే బౌలింగ్ లో కూడా మన బౌలర్లు పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయారు. కొంతవరకు మహమ్మద్ షమీ మొదట్లో తన పేస్ బౌలింగ్ తో మ్యాజిక్ చేసినప్పటికీ కొద్ది ఓవర్లు గడిచిన తర్వాత మాత్రం బౌలర్లు అందరూ చేతులెత్తేశారు. దాంతో ఇండియా కి మరోసారి విశ్వ విజేత అయ్యే అవకాశం చేతుల దాకా వచ్చి చేజారిపోయింది. ఇక ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది.

ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లో కూడా ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. ఇలా ఒకే సంవత్సరంలో రెండు ఫార్మాట్లో రెండు వరల్డ్ కప్పులను ఆస్ట్రేలియా మీదనే ఓడిపోయి ఇండియా ఘోర అవమానాన్ని పొందింది. ఇక 2003 నాటి రివేంజ్ ఏమో కానీ ఇప్పుడు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది…ఇలా ఇండియన్ టీం వరుసగా ఫైనల్స్ లో ఓటములను చవి చూడటం అనేది యావత్ ఇండియన్ అభిమానులందరినీ తీవ్ర నిరాశకు గురిచేసింది