మానవులు ఉండే చోటు మీద వారికి కలిగే ఆపేక్ష.
మానవులకు తాము నివశించే స్థానం మీద వారికి కలిగే భావోద్వేగాల బంధమే ‘ ఉండే చోటు మీద ఆపేక్ష ‘ ! సామాజిక మనస్తత్వం లేదా పర్యావరణ మనస్తత్వం లో ’ ఉండే చోటు మీద కలిగే ఆపేక్ష లేదా ఎటాచ్ మెంట్ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది !
మనం ఉండే చోటు మీద మనకు కలిగే ఈ ఆపేక్ష , మన మీదా , మన వ్యక్తి గత అనుభవాల మీదా ఆధార పడి ఉంటుంది ! అంటే , మనకు ఒక చోటు మీద ఎటాచ్ మెంట్ ఉందంటే , ఆ ఎటాచ్ మెంట్ , మన మీదా , మనకు ఆ స్థానం తో కలిగిన అనుభవాల మీదా ఆధార పడి ఉంటుంది ! సహజం గా మనం , ఇతర దేశాల కు వెళ్ళినప్పుడు , ఆ యా దేశాల , ప్రాంతాల , జన జీవనాలనూ , జనావాసాలనూ పరిశీలిస్తూ ఉన్నా కూడా , అవకాశం వచ్చి , ఆ యా దేశాలలో ఉండ వలసి వచ్చినా కూడా , ‘ మన దేశమూ కాదు , మన భాషా కాదు ! అని అనుకుంటూ ఉంటాము ! ( మనకు ఆ దేశ భాష వచ్చినా కూడా ! ) ఇట్లా , మనం నివశించే స్థానం మీద , మనకు ఏర్పడే ఎటాచ్ మెంట్ లేదా ఆపేక్ష కు కారణాలు తెలుసుకోడానికి కొంత పరిశోధన జరిగింది !
(PC-Google) Location :Miami-Florida.
ష్రో డ ర్ అనే శాస్త్ర వేత్త ఈ ఎటాచ్ మెంట్ రెండు రకాలు గా ఉంటుందని తెలిపాడు ! ఒకటి మనం ఒక ప్రాంతం లో నివశిస్తూ , ఆ ప్రాంతం మీద మనకు కలిగే , అనుభూతులూ , భావోద్వేగాలూ , అనుభవాలూ , వీటి ద్వారా ఏర్పడే ఎటాచ్మెంట్ ఒక రకమైనది గానూ , మనం ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాన్ని , అంతకు పూర్వం ఉన్న ప్రాంతం తో పోల్చుకుని , మనం ఏర్పరుచుకునే అనుభూతుల ఎటాచ్ మెంట్ ఇంకో రకమైనది గానూ ! అంటే ఈ రెండో రకమైన ఇష్టం , కేవలం , రెండు స్థానాలనూ పోల్చి ఏర్పరుచుకునే అభిప్రాయం !
- క్రిష్ణ మంతెన (సేకరణ)
Comments
0 comment